Share News

Eagle Video: పీత పవరేంటో ఎప్పుడైనా చూశారా.. దాడి చేయబోయిన డేగను..

ABN , Publish Date - Jan 23 , 2025 | 07:43 AM

Eagle video: ఆకలితో ఉన్న ఓ డేగకు ఎక్కడా ఆహారం కనిపించకపోవడంతో చివరకు నీటిలోని చేపలను వేటాడేందుకు వెళ్లింది. నీటి ఒడ్డున నిలబడి చేపలేమైనా కనిపిస్తాయేమో అని చూస్తోంది. అయితే ఇంతలో దానికి ఓ పీత కనిపించింది. చేపలు లేకపోతేనేం.. ప్రస్తుతానికి ఈ పీతతో సరిపెట్టుకుందాం.. అనుకుంటూ..

Eagle Video: పీత పవరేంటో ఎప్పుడైనా చూశారా.. దాడి చేయబోయిన డేగను..

గద్ద, డేగ, రాబందులకు ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ నేలపై ఉన్న చిన్న చిన్న జీవులను సైతం గుర్తించి వేటాడేస్తుంటాయి. ఒక్కసారి వాటి కంటపడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు వీటికి కూడా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పీతపై దాడి చేయాలని చూసిన డేగకు చివరకు పెద్ద షాక్ తగిలింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Eagle viral video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ డేగకు ఎక్కడా ఆహారం కనిపించకపోవడంతో చివరకు నీటిలోని చేపలను వేటాడేందుకు వెళ్లింది. నీటి ఒడ్డున నిలబడి చేపలేమైనా కనిపిస్తాయేమో అని చూస్తోంది. అయితే ఇంతలో దానికి ఓ పీత (crab) కనిపించింది. చేపలు లేకపోతేనేం.. ప్రస్తుతానికి ఈ పీతతో సరిపెట్టుకుందాం.. అనుకుంటూ ముక్కతో పట్టేసుకుంది.

Viral Video: ఇలాంటి స్విచ్ బోర్డును ఎక్కడైనా చూశారా.. ఈ ఎలక్ట్రీషియన్‌‌ ఎవరో గానీ దండం పెట్టొచ్చు..


అయితే డేగ పట్టుకోగానే పీత అలెర్ట్ అయిపోయింది. ‘‘నన్నే చంపేందుకు ప్రయత్నిస్తావా.. చూడు నిన్ను ఏం చేస్తానో’’.. అని అన్నట్లుగా డేగ మూతిని గట్టిగా పట్టేసుకుంటుంది. పీత ఊహించని విధంగా ఇలా ఉక్కిరిబిక్కిరి చేయడంతో డేగ షాక్ అవుతుంది. దాన్నుంచి విడిపించుకునే క్రమంలో అటూ, ఇటూ తిరుగుతూ చివరకు నీటిలో పడిపోతుంది. ఇలా చాలా సేపు ప్రయత్నించి ఎలాగోలా పీత నుంచి విడిపించుకుని నీటి ఒడ్డుకు వచ్చేస్తుంది. ‘‘వామ్మో.. కాసేపుంటే ఈ పీత నా ప్రాణాలు తీసేదిరా బాబోయ్.. వెంటనే ఇక్కడి నుంచి జంప్ అవడం మేలు’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది.

Viral Video: హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలు స్పందిస్తున్నారు. ‘‘డేగకు చుక్కలు చూపించిన పీత’’.. అంటూ కొందరు, ‘‘డేగ ఓడిపోవడం మొదటిసారి చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2025 | 10:21 AM