Share News

World’s First Commercial Flight: ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ విమాన ప్రయాణం.. టిక్కెట్ ధర ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:46 PM

ప్రపంచంలోని తొలి కమర్షియల్ విమానం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల సెయింట్ పీటర్స్‌బర్గ్, టాంపా నగరాల మధ్య సాగింది. తొలి టిక్కెట్‌ను వేలం వేయగా సెయింట్ పీటర్స్‌బర్గ నగర మేయర 400 డాలర్లకు దక్కించుకున్నారు.

World’s First Commercial Flight: ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ విమాన ప్రయాణం.. టిక్కెట్ ధర ఎంతో తెలిస్తే..
World’s First Commericial Flight

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో విమాన ప్రయాణం సర్వసాధారణ విషయం. అయితే, 19వ శతాబ్దం తొలి నాళ్లల్లో మాత్రం ఇదో అద్భుతం. పక్షులు లాగా గగన విహారం చేయాలన్న కల నిజమైన క్షణం. 1903, డిసెంబర్ 17న రైట్ సొదరులు తొలిసారిగా విమానం నడిపారు. విమానం కొన్ని నిమిషాల పాటు మాత్రమే నియంత్రిత విధానంలో గాల్లో ఎగిరినా విమాన ప్రయాణాలు సాధ్యమేమనని రైట్ సోదరులు నిరూపించిన క్షణం అది. చరిత్రలో ఓ అద్భుత ఘట్టం (World first Commercial Fight Journey).

Child Driving SUV: భారీ ట్రాఫిక్‌లో ఎస్‌యూవీ నడిపి స్కూలు పిల్లలు.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు

ఆ తరువాత మరో పదేళ్లకు తొలి కమర్షియల్ విమానం దిగ్విజయంగా ప్రయాణం పూర్తి చేసింది. విమానయాన రంగంలో ఓ కొత్త అధ్యయనానికి నాంది పలికింది. 1914 జనవరి 1న సెయింట్ పీటర్స్‌బర్గ్-టాంపా ఎయిర్‌బోట్ లైన్ అనే సంస్థ ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్ బర్గ్, టాంపా నగరాల మధ్య ఈ విమానం నడిపింది. దీని పైలట్ టోనీ జానస్.


కేవలం రెండు సీట్లే ఉన్న ఈ విమానంలో జర్నీకి టిక్కెట్‌ను వేలం వేయగా సెయింట్ పీటర్స్ బర్గ్ నగర మేయర్ అబ్రహాం సీ ఫీల్ 400 డాలర్లు పెట్టి ఈ టిక్కెట్‌ను దక్కించుకున్నారు.

Holi stain Removal: హోలీ రంగులు వదలక సతమతం అవుతున్న వారు ఇలా చేస్తే..

34 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి విమానం 23 నిమిషాల్లో చేరుకుంది. అంటే గంటకు 64 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది. మరి ఇప్పటి విమానాలు గంటకు సుమారు 929 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయంటే విమానయానం ఎంతగా అభివృద్ధి అయ్యందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


ఇక 400 డాలర్ల టిక్కెట్ అంటే నేటి ధరల్లో సుమారు రూ. పది లక్షలకు సమానం. ఆ తరువాత ఈ నగరాల మధ్య జర్నీకి టిక్కెట్ ధరను 5 డాలర్లుగా ఖరారు చేశారట. వారానికి మూడు సార్లు విమాన సర్వీసును ఖరారు చేశారట.

ఇక భారత్‌లో తొలి కమర్షియల్ విమాన ప్రయాణం జేఆర్‌డీ టాటా ఆధ్వర్యంలోని టాటా ఎయిర్‌లైన్స్ నిర్వహించింది. అప్పట్లో సింగిల్ ఇంజెన్ పుస్‌మొత్ విమానం కరాచీ నుంచి ముంబైకి చేరుకుంది. భారత ఉపఖండ చరిత్రలో తొలి కమర్షియల్ విమాన ప్రయాణంగా ఇది రికార్డుకెక్కింది.

Harsh Goenka wealth tips: ధనవంతులు కావాలనుందా.. ఈ పారిశ్రామికవేత్త చెప్పిన 6 సూత్రాలను ఫాలో అయితే..

Read Latest and Viral News

Updated Date - Mar 15 , 2025 | 03:50 PM