Dramatic Escape from Quake: భూప్రకంపనలకు షాక్.. 40వ అంతస్తు నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:48 PM
భూకంప సమయంలో 40వ అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎలా కిందకు వచ్చిందీ చెబుతూ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మయాన్మార్‌ను తాజాగా తాకిన భూకంపం ప్రళయం సృష్టించింది. భవనాలు కూలడంతో అనేక మంది మరణించగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. భూకంపం తాలూకు ప్రకంపనలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌ను కూడా వణికించాయి. భారీ భవంతుల్లో ఉన్న అనేక మంది భూప్రకంపనల ధాటికి హడలిపోయారు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని భవంతుల నుంచి బయటపడ్డారు. భూకంపం సమయంలో తాను ఎలా తప్పించుకున్నదీ చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.
Also Read: సిజేరియన్ ఆపరేషన్.. 17 ఏళ్ల తరువాత మహిళ కడుపులో కత్తెర తొలగింపు
స్కాట్‌లాండ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ ట్రావిస్ లియోన్ భూకంప సమయంలో తనకెదురైన అనుభాన్ని నెట్టింట పంచుకున్నాడు. ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. భూకంప సమయంలో తాను 40వ అంతస్తులో ఉన్నట్టు తెలిపాడు. కిటికీలోంచి బయటకు చూస్తే భయానక దృశ్యాలు కనిపించాయని అన్నాడు. ఆకాశహర్మ్యాలపై ఉన్న స్వీమ్మింగ్ పూల్స్‌లోని నీరు అలలుగా పోటెత్తిందని చెప్పారు. భవనం కింద ఉన్న వారిపై జలపాతాల రూపంలో పడిందని అన్నారు. దీంతో, తాను గబగబా మెట్ల మీదుగా కిందకు దిగిపోయానని చెప్పాడు. 40వ అంతస్తు నుంచి కిందకొచ్చేందుకు ఏకంగా 20 నిమిషాలు పట్టిందని, తాను నిజంగానే అదృష్టవంతుణ్ణని వ్యాఖ్యానించాడు.
Also Read: జాబ్ చేసే వారికి సమస్యలు తెచ్చిపెట్టే అలవాట్లు ఇవే
ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. తమకు ఇలాంటి అనేక అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. స్విమ్మింగ్ పూల్‌లో నీరు ఆరు అడుగుల ఎత్తుకు లేచిన దృశ్యాన్ని చూసి తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. తాను కూడా ఓ స్కై స్క్రేపర్‌పై ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతుండగా భూమి కంపించిందని ఓ వ్యక్తి చెప్పాడు. భూ ప్రకంపనలతో స్విమ్మింగ్ పూల్‌లో నీరు ఎగసి పడటం చూసి గుండె ఆగినంతపనైందని చెప్పుకొచ్చారు.