Share News

Ram Navami: బెంగాల్‌లో రామనవమి ఊరేగింపునకు కోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:37 PM

గత ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది ఊరేగింపులకు అనుమతి ఇవ్వరాదని బెంగాల్ పోలీసులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.

Ram Navami: బెంగాల్‌లో రామనవమి ఊరేగింపునకు కోర్టు గ్రీన్‌సిగ్నల్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో శ్రీరామ నవమి ఊరేగింపులకు అవాంతరం తొలిగిపోయింది. రామనవమి ఊరేగింపులు నిర్వహించుకునేందుకు హిందూ సంస్థలకు కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) అనుమతి ఇచ్చింది. గత ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది ఊరేగింపులకు అనుమతి ఇవ్వరాదని బెంగాల్ పోలీసులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో హౌరాలో రామనవమి ఊరేగింపులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Rahul Gandhi: కాథలిక్ సంస్థలే ఆర్ఎస్ఎస్ తదుపరి టార్గెట్.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు


ఊరేగింపులో పాల్గొనే వారు ఎలాంటి ఆయుధాలు కానీ, కర్రలు కానీ కలిగి ఉండరాదని, వారి సంఖ్య 500కు పరిమితం చేయాలని, డీజేలు అనుమతించరాదని, ఊరేగింపు వెళ్లే రూట్‌ను కచ్చితంగా పాటించాలని, ఊరేగింపులో పాల్గొనే వారు ఐడీ కార్డు ప్రతిని పోలీసులకు అందచేయాలని కోర్టు షరతులు విధించింది.


ఏం జరిగింది?

రామనవమి ఊరేగింపునకు అనుమతించాలని హౌరా జిల్లా పోలీసులను హిందూ సంస్థలు కోరాయి. అయితే 2023, 2024లో రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు, రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకున్నందున అనుమతి ఇవ్వలేమని పోలీసులు నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని అంజని పుత్ర సేన, విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. అయితే కోర్టు నిర్ణయం హిందూ సంస్థలకు అనుకూలంగా వచ్చింది.


ఇవి కూడా చదవండి..

Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు

Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ

Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 08:41 PM