Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:35 PM
కొందరు ఎంత పని చేసినా చాలీచాలని జీతంతో జీవితాన్ని గడుపుతుంటారు. మరికొందరు వినూత్న దారిలో వెళ్లి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఇంగ్లండ్‌లోని హార్లోకి చెందిన 31 ఏళ్ల వ్యక్తి మీరు ఊహించలేని వృత్తిని ఎంచుకుని కోట్లు సంపాదిస్తున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ ప్రపంచంలో సంపాదన కోసం ఒక్కొక్కరూ ఒక్కో దారిని ఎంచుకుంటారు. కొందరు ఎంత పని చేసినా చాలీచాలని జీతంతో జీవితాన్ని గడుపుతుంటారు. మరికొందరు వినూత్న దారిలో వెళ్లి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఇంగ్లండ్ (England)లోని హార్లోకి చెందిన 31 ఏళ్ల వ్యక్తి మీరు ఊహించలేని వృత్తిని ఎంచుకుని కోట్లు సంపాదిస్తున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు చేసే పని స్మశానంలోని సమాధులను శుభ్రపరచడం (Grave Cleaner). అతడి ఉద్యోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది (Viral Video).
ఇంగ్లండ్‌లోని హార్లోకి చెందిన షాన్ టుక్సీ గతేడాది స్మశానంలో సమాధులను శుభ్రపరిచే వ్యాపారం ప్రారంభించాడు. అతడు స్మశానానికి వెళ్లి సమాధులను శుభ్రపరచడం, పెయింటింగ్ వేయడం, సమాధుల మీద అక్షరాలు చెరిగిపోతే తిరిగి రాయడం వంటి పనులు చేస్తున్నాడు. అందుకోసం ఒక్కో సమాధికి 562 డాలర్లు (దాదాపు రూ. 46,600) ఛార్జ్ చేశాడు. అలా ఇప్పటివరకు 300కు పైగా సమాధులను క్లీన్ చేశాడు. ఆ సంపాదనతో షాన్ 2024 డిసెంబర్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అతడు రోజుకు రెండు నుండి నాలుగు సమాధులను శుభ్రం చేస్తాడు.
షాన్ చేసే పని టిక్‌టాక్, ఫేస్‌బుక్ ద్వారా ప్రజాదరణ పొందింది. @thegravecleaner అనే తన ఎక్స్ హ్యాండిల్‌లో వీడియోలను షేర్ చేస్తుంటాడు. ``చాలా మంది వ్యక్తులు చేయలేని సేవను అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది చాలా సంతృప్తికరమైన పని. తమ ప్రియమైనవారి సమాధులను ఎలా శుభ్రం చేయాలో తెలియని ఇతరులకు సహాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ పని ద్వారా నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది`` అని షాన్ పేర్కొన్నాడు. కాగా, షాన్‌కు సోషల్ మీడియా ద్వారానే సమాధాలు క్లీనింగ్ ఆర్డర్లు లభిస్తుంటాయి.
ఇవి కూడా చదవండి..
Viral Video: స్కూటీ మీద వేగంగా వెళ్తున్న యువతికి అడ్డొచ్చిన బారికేడ్.. ఆమె ఏం చేసిందో చూడండి..
Optical Illusion: మీ కంటి చూపు అద్భుతం అయితే.. ఈ బాత్రూమ్‌లో కారు బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి..
Viral Video: విమానంపై నేరుగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి