Share News

Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

ABN , Publish Date - Feb 12 , 2025 | 07:37 PM

కుంభమేళాలో భార్యా అకస్మాత్తుగా కనిపించకపోవడంతో భయపడిపోయిన ఓ వ్యక్తి ఆ మరుక్షణం వారు కనిపించగానే భావోద్వేగం తట్టుకోలేకపోయాడు. వలవలా కన్నీరు కార్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ భావనను మాటల్లో వ్యక్తీకరించడం కష్టం. ముఖ్యంగా జీవిత భాగస్వామిపై ఉండే ప్రేమాభిమానాలు, ఆప్యాయత అంతా ఇంతా కాదు. ప్రతి క్షణం ఈ భావనను జంటలు వ్యక్త పరచకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో దానంతట అదే బయట పడిపోతుంది. చూసే వారికి కూడా ముచ్చట కలిగిస్తుంది. కుంభమేళాలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral).

కుంభమేళాకు కోట్ల మంది వస్తు్న్నారు. ఆ రద్దీని తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాస్తంత ఏమరపాటు ప్రదర్శించినా మనతో పాటు వెంట వచ్చే వారు తప్పిపోవడం పక్కా. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అయితే, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇటీవల ఓ వ్యక్తికి సరిగ్గా ఇదే జరిగింది.


Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!

కుంభమేళాలో ఉండగా ఓ వ్యక్తి భార్యాపిల్లలు సడెన్‌గా అదృశ్యమయ్యారు. అప్పటివరకూ తన వెంటే ఉన్న వారు కనిపించకపోవడంతో అతడికి గుండె జారిపోయింది. ఆందోళన పెరిగిపోయింది. చుట్టూ ఉన్న జనసంద్రం చూశాక భార్యాపిల్లలు ఇక కనబడరేమో అని బెంబేలెత్తిపోయాడు. దుఃఖం పొంగొకొచ్చేసింది. వలవలా ఏడ్చేశాడు. చుట్టూ ఉన్న వారు ఎంత సముదాయించినా అతడిని ఊరడించలేకపోయారు.


Racial Abuse: లండన్ రైల్లో భారత సంతతి యువతికి దారుణ వేధింపులు! షాకింగ్ వీడియో

అదృష్టవశాత్తూ అతడి భార్యాపిల్లలు కొద్ది క్షణాల్లోనే అతడిని వెతుక్కుంటూ వచ్చేశారు. వారేమైపోయారు అనుకుంటూ వలవలా కన్నీరు కారుస్తున్న అతడు భార్యాబిడ్డల్ని చూడగానే ఆనందం పీక్స్‌కు చేరింది. దీంతో, వారిని కౌగిలించుకుని మరింతగా కన్నీరుకార్చాడు. అతడి సంబరం చూసి భార్య కూడా మురిసిపోయింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగిన ఈ ఉదంతం అక్కడి వారికి కదిలించింది. అతడి పరిస్థితి, భార్యాబిడ్డలపై అతడికున్న ప్రేమాభిమానాలు చూసి ముచ్చటపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కూడా వేల కొద్దీ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే జీవితభాగస్వామిపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. మరి ఈ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Latest and Viral News

Updated Date - Feb 12 , 2025 | 07:38 PM