Harsh Goenka wealth tips: ధనవంతులు కావాలనుందా.. ఈ పారిశ్రామికవేత్త చెప్పిన 6 సూత్రాలను ఫాలో అయితే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:18 PM
సంపన్నులు మారేందుకు అనుసరించాల్సి ఆరు సింపుల్ టిప్స్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ధనవంతులు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏం చేయాలో ఎలా ముందుకెళ్లాలో తెలీక తికమక పడుతుంటారు. అలాంటి వారికోసమే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయెంక్ ఆరు సూత్రాలను పంచుకున్నారు. దీనిపై నెట్టింట ప్రస్తుతం పెద్ద డిబేట్ జరుగుతోంది (Harsh Goenka wealth tips).
సంపద కూడబెట్టుకునేందుకు సహకరించే ఆరు సూత్రాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు కూడబెట్టుకోవడం, ఆదాయం కంటే తక్కువగా ఖర్చులను పరిమితం చేసుకోవడం, కేవలం ఆదాయం కోసం కాకుండా సంపద సృష్టిపై దృష్టి పెట్టడం, ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవడం, కేవలం ఆదాయం కోసం కాకుండా కొత్త విషయాలు నేర్చుకునేందుకు పని చేయడం అనే సూత్రాలను ఫాలో అయితే కచ్చితంగా ధనవంతులు కావొచ్చని భరోసా ఇచ్చారు. ఈ సులువైన టిప్స్ పాటిస్తే ధనవంతులు అవుతారని అన్నారు.
Injured Monkey treated in Pharmacy: మనుషులను చూసి తెలివి నేర్చిన కోతి.. చేతికి గాయం కావడంతో...
ఇక ఈ పోస్టుపై నెట్టింట సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆయన సూత్రాలు ఆచరణీయమని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఆయన అభిప్రాయాలతో కొంత విభేదించారు. ‘‘ఇవన్నీ నిజమే కానీ ధనవంతులు కావాలంటే ముందు సంపన్నుల ఇంట్లో పుట్టాలి. కానీ ఇది లక్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
మరో తుంటరి వ్యక్తి.. మీ సక్సెస్ ఫార్ములా ఏమిటో చెప్పండని ప్రశ్నించారు. దీనికి హర్ష్ గోయెంకా కూడా ఆదే స్థాయిలో స్పందించారు. ‘‘ముందు ఆ స్థాయి విజయాన్ని అందుకున్నాకా అప్పుడు చెబుతా’’ అని కామెంట్ చేశారు.
కాగా, జీవితంలో విజయం ఎలా సాధించాలనే దానిపై రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ కూడా గతంలో ఓసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆలోచనను ఎంచుకుని దాన్నే జీవితంగా మార్చుకుని, నరనరానా నింపుకుని లక్ష్యం వైపు కదలడమే విజయానికి సూత్రమన్న స్వామి వివేకానంద సూత్రాన్ని తాను పాటిస్తానని అన్నారు.
ఏవరీ హర్ష్ గోయెంకా..
ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయెంకా. ఆయన కుటుంబానికి వ్యాపార నేపథ్యమే. తమ కుటుంబానికి సంబంధించి ఐదో తరం వ్యక్తిగా ఆయన ఆర్‌పీజీ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్నారు.