Share News

AFG vs AUS: స్టన్నింగ్ యార్కర్.. బుమ్రాను గుర్తుచేసిన ఆసీస్ పేసర్

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:24 PM

Spencer Johnson: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. కానీ అతడ్ని గుర్తుచేశాడో బౌలర్. బుమ్రా మాదిరి స్టన్నింగ్ యార్కర్‌తో మెస్మరైజ్ చేశాడు. ఎవరా బౌలర్? అనేది ఇప్పుడు చూద్దాం..

AFG vs AUS: స్టన్నింగ్ యార్కర్.. బుమ్రాను గుర్తుచేసిన ఆసీస్ పేసర్
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసే మ్యాచ్‌కు గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నాకౌట్ చేరే అవకాశం ఉండటంతో రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. తగ్గేదేలే అంటూ ఫైట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఆరంభంలోనే ఆ టీమ్‌కు గట్టి షాక్ తగిలింది. కంగారూ యంగ్ పేసర్ స్పెన్సర్ జాన్సర్ కళ్లుచెదిరే యార్కర్‌తో ఆఫ్ఘాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (0)ను వెనక్కి పంపించాడు.


బిత్తరపోయాడు

నమ్మశక్యం కాని యార్కర్‌తో గుర్బాజ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు స్పెన్సర్ జాన్సన్. అతడు వేసిన బంతి గాల్లో స్వింగ్ అవుతూ సరిగ్గా వికెట్లకు ముందు బ్లాక్ హోల్‌లో ల్యాండ్ అయింది. డిఫెన్స్ చేయడానికి కూడా వీలు లేకుండా నేరుగా ల్యాండ్ అవగానే వికెట్లను చెల్లాచెదురు చేసింది. బంతి గాల్లో దిశను మార్చుకొని రావడం, బ్యాట్ కిందకు తీసుకురావడంలో గుర్బాజ్ ఆలస్యం చేయడంతో పడిన వెంటనే వికెట్లను గిరాటేసింది. దీంతో అసలు ఏం జరిగిందో తెలియక ఆఫ్ఘాన్ ఓపెనర్ బిత్తరపోయాడు. ఇదేం బంతి రా నాయనా అంటూ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ డెలివరీ చూసిన నెటిజన్స్.. బుమ్రాను జాన్సన్ గుర్తుచేశాడని అంటున్నారు. అతడిలాగే స్టన్నింగ్ యార్కర్ వేశాడని చెబుతున్నారు. అయితే ఆసీస్ ఫ్యాన్స్ మాత్రం ఈ బాల్ స్టార్క్‌ వేసే డెలివరీ అని.. సీనియర్ బౌలర్‌ను జాన్సన్ గుర్తుచేశాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆఫ్ఘాన్ 27 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులతో ఉంది. సెదీఖుల్లా అతల్ (69 నాటౌట్), హష్మతుల్లా షాహిదీ (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


ఇవీ చదవండి:

రోహిత్ లేకుండానే బరిలోకి..

గార్డ్‌నర్‌ ధనాధన్‌

ఎవరిదో సెమీస్‌ బెర్త్‌?

‘వన్‌ లాస్ట్‌ టైమ్‌’ !

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 04:36 PM