Share News

IND vs PAK Prediction: భారత్-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వింటే మెంటలెక్కిపోద్ది

ABN , Publish Date - Feb 22 , 2025 | 10:53 AM

IIT Baba Prediction: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ దాయాదులు మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IND vs PAK Prediction: భారత్-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వింటే మెంటలెక్కిపోద్ది
IND vs PAK

చాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. దాయాదులు భారత్-పాకిస్థాన్ కొట్లాటకు అంతా రెడీ అయింది. దుబాయ్ వేదికగా జరిగే సండే ఫైట్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇందులో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది కాబట్టి చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఇంటిదారి పట్టే ప్రమాదం పొంచి ఉండటంతో ఎలాగైనా గెలిచి తీరాలని డిసైడ్ అయింది పాక్. ఇలా వైరి దేశాల పోరు కీలకంగా మారిన నేపథ్యంలో ఐఐటీ బాబా ఊహించని విధంగా ప్రిడిక్షన్ చెప్పారు. ఆయన ఏం చెప్పారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.


ఓటమి తప్పదు!

ఇండో-పాక్ ఫైట్‌పై రకరకాల ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. ఆ టీమ్ గెలుస్తుందంటే.. ఆ టీమ్ గెలుస్తుందంటూ ఎక్స్‌పర్ట్స్, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు అంచనాలు వేస్తున్నారు. ఈ తరుణంలో రీసెంట్‌గా మహా కుంభమేళాతో ఒక్కసారిగా పాపులర్‌గా మారిన ఐఐటీ బాబా కూడా తన ప్రిడిక్షన్ చెప్పారు. ఈసారి పాకిస్థాన్ గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. ఎప్పటిలాగే టీమిండియా నెగ్గుతుందని అనుకోవద్దని.. దాయాదితో పోరులో ఈసారి రోహిత్ సేనకు ఓటమి తప్పదంటూ షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు.


భారత్ గెలవదు!

‘నేను మొదట్నుంచి చెబుతున్నా.. ఈసారి టీమిండియాకు ఓటమి తప్పదు. భారత జట్టు ముమ్మాటికీ గెలవదు. విరాట్ కోహ్లీ లేదా ఇంకే భారత ప్లేయర్ అయినా సరే ఎంత బాగా ఆడినా ఓటమి మాత్రం తప్పదు. పదే పదే చెప్పలేను. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదు. ఏం జరగాలని రాసి ఉందో అది జరిగి తీరుతుంది. నేను చెప్పాను కదా.. భారత్‌కు ఓటమి తప్పదు. నేను గెలవదని చెప్పానంటే.. గెలవదు అంతే! దేవుడు గొప్పా? మీరు గొప్పా?’ అని ఐఐటీ బాబా సీరియస్ అయ్యారు. ఆయన ప్రిడిక్షన్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ప్రిడిక్షన్ రివర్స్ అయితే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉందని, జట్టు నిండా స్టార్లే ఉన్నారని.. అటు పాక్ చెత్తగా ఆడుతోందని, గాయాలతో ఇబ్బంది పడుతోందని.. ఏ విధంగా చూసినా రోహిత్ సేనదే గెలుపని ఘంటా పథంగా చెబుతున్నారు నెటిజన్స్.


ఇవీ చదవండి:

భారత్‌తో మ్యాచ్‌.. పాక్‌కు గట్టి షాక్

మొనగాడి ఎంట్రీ.. పాక్‌కు ఇక కాళరాత్రే

మా దెబ్బ మామూలుగా ఉండదు.. హార్దిక్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 11:03 AM