Share News

IND vs PAK: పాక్‌తో పోరు.. ప్లేయింగ్ 11తోనే చెమటలు పట్టిస్తున్న రోహిత్

ABN , Publish Date - Feb 22 , 2025 | 02:10 PM

India Prediction 11: భారత్-పాక్ సంకుల సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల్లో ఈ దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పోరులో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK: పాక్‌తో పోరు.. ప్లేయింగ్ 11తోనే చెమటలు పట్టిస్తున్న రోహిత్
Champions Trophy 2025

భారత్-పాకిస్థాన్.. ఈ చిరకాల ప్రత్యర్థులు సాధారణ సిరీస్‌లో తలపడితేనే ఎగ్జయిట్‌మెంట్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అలాంటిది ఐసీసీ టోర్నమెంట్‌లో ఎదురుపడితే ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. బోర్డర్‌తో పాటు క్రికెట్ పిచ్ మీదా వైరి కలిగిన ఈ దాయాదులు సండే ఫైట్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకవేళ భారత్ నెగ్గితే సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది. అదే పాక్ గెలిస్తే ఆ టీమ్‌కు నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇరు టీమ్స్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో వెళ్లనుందో ఇప్పుడు చూద్దాం..


మార్పులు ఖాయం!

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో దాదాపుగా అదే జట్టును టీమిండియా రిపీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రెండు మార్పులు మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దుబాయ్ పిచ్, కండీషన్స్‌ను మరింత బాగా వినియోగించుకోవడంతో పాటు బౌలింగ్ యూనిట్‌లో ఇంకా వైవిధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఇద్దరు బౌలర్లను రీప్లేస్ చేయడం పక్కా అని తెలుస్తోంది. శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు దిగుతారు. పేస్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌ బాధ్యతలు చూసుకుంటాడు.


ఇద్దరు ఇన్.. ఇద్దరు ఔట్!

స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎలాగూ టీమ్‌లో ఉంటారు. పాండ్యాతో కలసి మిడిలార్డర్‌ను వీళ్లు ముందుకు నడిపిస్తారు. అయితే గత మ్యాచ్‌లో ఆడిన కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో పేస్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ రాక కూడా గ్యారెంటీగా అనిపిస్తోంది. హర్షిత్ రాణా గత మ్యాచ్‌లో బాగానే పెర్ఫార్మ్ చేసినా.. పాక్ బ్యాటర్లపై లెఫ్టార్మ్ పేస్‌ ఆయుధాన్ని వాడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లీడ్ పేసర్‌గా మహ్మద్ షమి ఎలాగూ టీమ్‌లో ఉంటాడు.

భారత జట్టు (అంచనా):

శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (సారథి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.


ఇవీ చదవండి:

పాక్‌కు చుక్కలే.. దమ్ముంటే ఆపండి

పగతో రగిలిపోతున్న రోహిత్

ఇండో-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వైరల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 05:56 PM