Siraj-Rohit: సిరాజ్‌కు రోహిత్ అన్యాయం.. కాక రేపుతున్న కొత్త కాంట్రవర్సీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:08 PM
IPL 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాదీ పేస్ గన్ మహ్మద్ సిరాజ్ విషయంలో హిట్‌మ్యాన్ చేసింది తప్పు అనే అభిప్రాయాలు మరింత బలపడుతున్నాయి. అసలేం జరిగింది.. అనేది ఇప్పుడు చూద్దాం..

మహ్మద్ సిరాజ్.. ఈ పేరు చెబితేనే ఐపీఎల్ టీమ్స్ భయపడుతున్నాయి. ఆర్సీబీకి చాలా ఏళ్ల పాటు ఆడుతూ వచ్చిన మియా.. ఈసారి గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. టీమ్ మారడంతో అతడు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సండే ఫైట్‌లో 4 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అతడు అదరగొడుతున్నాడు. దీంతో ఒకవైపు సిరాజ్‌ను మెచ్చుకుంటూనే.. మరోవైపు అతడికి అన్యాయం చేశాడంటూ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై విమర్శలూ వస్తున్నాయి. అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..
వికెట్ల మోత
సిరాజ్ దమ్మున్న పేసర్. గత కొన్నేళ్లుగా వైట్‌బాల్ క్రికెట్‌లో వికెట్లతో దుమ్మురేపుతున్నాడు. అయినా రీసెంట్‌గా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌కు అతడ్ని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. పాత బంతితో వికెట్లు తీయడం, అలాగే డెత్ ఓవర్లలో బ్రేక్‌త్రూలు అందించడంలో సిరాజ్‌కు తడబాటు ఉందనే కారణం చూపి అతడ్ని దుబాయ్ ఫ్లైట్ ఎక్కించలేదు. అయితే తాజా ఐపీఎల్‌లో మిడిల్ ఓవర్లలో వికెట్ల మోత మోగిస్తున్నాడు సిరాజ్. పాత బంతితో డెత్ ఓవర్లలోనూ బ్రేక్‌త్రూలు అందిస్తూ గుజరాత్‌కు ప్రధాన ఆయుధంగా మారాడు. స్లో డెలివరీస్, యార్కర్స్‌తో పాటు సీమ్, స్వింగింగ్ బాల్స్‌తో బ్యాటర్లకు పోయిస్తున్నాడు.
దిమ్మతిరిగే జవాబు
ఐపీఎల్‌లో సిరాజ్ బౌలింగ్‌తో రచ్చ చేస్తుండటంతో ఇలాంటోడ్ని చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరాజ్ పవర్‌ప్లేలో వేయలేడు, పాత బంతితో రాణించడలేడని అన్నారు కదా.. ఇప్పుడు ఏమంటారు అంటూ బీసీసీఐతో పాటు కెప్టెన్ రోహిత్ మీద అంతా సీరియస్ అవుతున్నారు. సిరాజ్‌కు హిట్‌మ్యాన్ అన్యాయం చేశాడని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటోడ్నా మిస్ చేసుకున్నారు అని సీరియస్ అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో సిరాజ్‌తో ఆరంభంలోనే బౌలింగ్ చేయించి ఉంటే.. ఆ ట్రోఫీ మిస్ అయ్యేది కాాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ సిరాజ్ అదరగొడుతున్నాడని.. రోహిత్ సంధించిన అన్ని ప్రశ్నలకు అతడు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడని మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధు అన్నాడు. మియా కంప్లీట్ బౌలర్ అని.. అతడికి ఇదే తన సెల్యూట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఇవీ చదవండి:
పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్
ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా..
సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి