Share News

IPL 2025: ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం.. ఇక ప్రచండ యుద్ధమే

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:02 PM

CSK: ఐపీఎల్-2025కు అన్ని జట్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. మిగతా టీమ్స్ కంటే ఎప్పుడూ ముందంజలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జోరుగా సన్నాహకాలు చేస్తోంది. ఈసారి కప్పు మిస్ అవ్వకూడదనే కసితో ఉంది సీఎస్‌కే.

IPL 2025: ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం.. ఇక ప్రచండ యుద్ధమే
IPL 2025

ఒకడేమో దారుణశస్త్రం.. అడ్డొచ్చిన బౌలర్లను చితక్కొడుతూ టీమ్‌ను సింగిల్ హ్యాండ్‌తో గెలిపించే బ్యాటర్. వికెట్ల వెనుకా మెరుపు వేగంతో కదులుతూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించే వికెట్ కీపర్. అక్కడితే అయిపోలేదు.. కెప్టెన్‌కు అండగా ఉంటూ టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచించే అపర మేధావి. మొత్తానికి జట్టును అంతా తానై నడిపించే సారథి. మరొకడేమో మారణశాస్త్రం.. గింగిరాలు తిరిగే బంతులతో అవతలి జట్లను ఉక్కిరిబిక్కిరి చేసే స్పిన్నర్. ఎంతటి తోపు బ్యాటర్లనైనా కన్‌ఫ్యూజ్ చేసి ఔట్ చేసే తెలివైన బౌలర్. అలాంటి ఈ ఇద్దరూ కలిస్తే.. అదీ ఒకే జట్టు తరఫున ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈసారి ఐపీఎల్‌లో అదే జరగబోతోంది. మరి.. ఎవరా ద్వయం? వాళ్లకు అంత బిల్డప్ అవసరమా? అనేది ఇప్పుడు చూద్దాం..


చేయి చేయి కలిపి..

లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ కలిశారు. చేయి చేయి కలిపి బరిలోకి దిగారు. వచ్చే ఐపీఎల్ కోసం వీళ్లిద్దరూ కలసి ప్రాక్టీస్ చేశారు. కొన్నాళ్లుగా ఇతర జట్లకు ఆడుతూ వస్తున్న అశ్విన్ తిరిగి తన సొంత గూడు చెన్నై సూపర్ కింగ్స్‌కు చేరుకున్నాడు. దీంతో ఇద్దరు లెజెండ్స్ కలసి గ్రౌండ్‌లో సందడి చేశారు. చెన్నైలో జరుగుతున్న సీఎస్‌కే క్యాంప్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్, ఫీల్డింగ్ డ్రిల్స్, బౌలింగ్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు.


పాత రోజుల్ని గుర్తుకుతెస్తూ..

సాధారణంగా ధోని ఉంటేనే సీఎస్‌కేను ప్రత్యర్థులు ఆపలేరు. అలాంటిది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి తురుపుముక్కలు అతడికి తోడుగా ఉంటే ఇంక కప్పు కొట్టకుండా అడ్డుకోవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాత దోస్తులు మళ్లీ కలుసుకోవడం, మళ్లీ ఎల్లో జెర్సీ వేసుకోనుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వీళ్ల జోరును ఆపడం ఎవరి తరం? అని క్వశ్చన్ చేస్తున్నారు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయని.. ధోని-అశ్విన్-జడేజా త్రయాన్ని గ్రౌండ్‌లో చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

యార్కర్ అంటే ఇది

రోహిత్ లేకుండానే బరిలోకి..

గార్డ్‌నర్‌ ధనాధన్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 05:17 PM