Rohit-Kohli: టీమిండియాను మార్చేసిన రోహిత్-కోహ్లీ.. ఒక్క మ్యాచ్‌తో టోటల్ చేంజ్
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:18 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో సెమీస్‌కు క్వాలిఫై అయింది. ఇదే జోరులో కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా దూసుకెళ్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపిస్తోంది. వరుసగా బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయింది భారత్. ఇదే జోరులో తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించి.. నాకౌట్‌కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూటగట్టుకోవాలని చూస్తోంది. ఇంకో రెండు మ్యాచులు నెగ్గితే కప్పు మనదే కాబట్టి ఎక్కడా అలసత్వం, పొరపాట్లకు తావివ్వొద్దని భావిస్తోంది. ఈ తరుణంలో సారథి రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లలో అగ్గి రాజేస్తున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
పక్కా ప్లానింగ్‌తో..
ఏ ఆటలోనైనా రికార్డులు, రివార్డులు గురించి ఆలోచించడం సాధారణమే. ఆటగాళ్ల గొప్పతనాన్ని రికార్డులు, స్టాటిస్టిక్స్, అవార్డులు, రివార్డులు, క్రేజ్ ఆధారంగానే అంచనా వేస్తారు. అయితే రోహిత్-కోహ్లీ మాత్రం వీటన్నింటినీ పక్కనపెట్టి జట్టు విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో వీళ్ల బ్యాటింగే దీనికి నిదర్శనం. ఔట్ అయినా ఫర్వాలేదు ఉన్నంత సేపు టీమ్‌కు మంచి స్టార్ట్ ఇవ్వడం, ప్రత్యర్థి బౌలర్లను డిఫెన్స్‌లోకి నెట్టడమే టార్గెట్‌గా రోహిత్ ఆడుతున్నాడు. అతడు తలచుకుంటే వాటిని బిగ్ స్కోర్స్‌గా మలచడం, కూల్‌గా ఆడుతూ సెంచరీలుగా కన్వర్ట్ చేయొచ్చు. కానీ ఉన్నంత సేపు విధ్వంసం, ఊచకోత కోయడమే ప్లాన్‌గా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.
కప్పు మీదే ఫోకస్
కోహ్లీ కూడా మైల్‌స్టోన్స్ గురించి పట్టించుకోకుండా పట్టుదలతో క్రీజులో నిలబడుతున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా సెంచరీపై అతడు పెద్దగా ఆసక్తి కనబర్చినట్లు అనిపించలేదు. అక్షర్ పటేల్ ఆఖర్లో ఎలాగూ గెలుస్తామనే ఉద్దేశంతో వరుసగా స్ట్రైకింగ్ ఇచ్చి సెంచరీ మార్క్‌ను అందుకునేలా ప్రోత్సహించడంతో కోహ్లీ ఆ దిశగా ప్రయత్నించాడు. ఈ మధ్య కాలంలో రోకో జోడీ వరుస వైఫల్యాలతో విమర్శల పాలవుతున్నారు. వాళ్లు కావాలనుకుంటే భారీ స్కోర్లతో క్రిటిక్స్‌కు కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ ఆ అవకాశం వస్తున్నా ముందు టీమ్ విజయం, ఆ క్రమంలో కుదిరితే రికార్డులు బ్రేక్ చేయడం అనేలా ఆడుతున్నారు. తమ ఆటతో టీమ్‌లోని ఇతర ఆటగాళ్లకూ అదే అలవాటు చేస్తున్నారు. పర్సనల్ రికార్డుల కంటే టీమ్ గెలుపు, కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆడేలా వారిలో అగ్గి పుట్టిస్తున్నారని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇది భారత్‌కు చాలా మందిదని.. లాంగ్ టైమ్‌లో టీమ్‌కు ఎంతో మంచి చేస్తుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
నేను బతికేది దాని కోసమే: రోహిత్
52 ఏళ్ల వయసులోనూ సచిన్ రప్పా రప్పా
నేను టీమిండియాను తప్పుపట్టలేదు: కమిన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి