Share News

IPL 2025 CKS Vs RCB: మరి కాసేపట్లో సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీ వ్యూహం ఇదేనా

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:11 PM

స్పిన్‌‌కు అనుకూలించే చెపాక్‌ స్టేడియంలో ఆర్సీబీ అదనపు స్పిన్నర్‌ను రంగంలోకి దించుతుందా అన్న ఆసక్తికర చర్చ అభిమానుల్లో జరుగుతోంది.

IPL 2025 CKS Vs RCB: మరి కాసేపట్లో సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీ వ్యూహం ఇదేనా
CKS Vs RCB IPL 2025

ఇంటర్నెట్ డెస్క్: మరో ఉత్కంఠ పోరుకు చెపాక్ స్టేడియం వేదిక కానుంది. అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య పోరు.. ప్రత్యర్థులుగా బరిలో నిలవనున్న ధోనీ, విరాట్.. ఫలితంగా ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. అయితే, ఆర్సీబీతో ఇప్పటివరకూ ఆడిన మ్యాచుల్లో మెజారిటీ సందర్భాల్లో చెన్నై తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. రెండు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచులు జరగ్గా 21 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించింది. అయితే, కోల్‌కతాను మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న బెంగళూరు.. చెన్నైకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Also Read: కావ్యా పాపను బాధపెట్టారు.. మిమ్మల్ని వదిలేది లేదు


ఆర్సీబీ వ్యూహం ఇదేనా..

చెపాక్ స్టేడియం స్పిన్‌కు అనుకూలం. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు కొంచెం కష్టమే. బౌలర్లు ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. నూర్ అహ్మద, అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ త్రయంతో సీఎస్కే బలంగా కనిపిస్తోంది. ఇక ఆర్సీబీ కూడా స్పిన్నర్లపై ఆశలు పెట్టుకుంది. గత మ్యాచులో కృనాల్ పాండ్య మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. 5.50 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు తీసిన జాష్ హేజల్ వుడ్‌పై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

స్పిన్‌కు అనుకూలించే పిచ్ కాబట్టి ఆర్సీబీ అదనపు స్పిన్నర్‌ను రంగంలోకి దింపుతుందా అన్న చర్చ జరుగుతోంది. చెపాక్ పరిస్థితులను బట్టి స్వప్నిల్ లేదా మోహిత్ రాఠీని బరిలోకి దింపొచ్చు. రషీఖ్ సలామ్ దార్ స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read: వాళ్ల వల్లే మ్యాచ్ పోయింది:కమిన్స్

అయితే, సీఎస్కే మాత్రం తన బౌలింగ్‌ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. సీఎస్‌కే స్పిన్ త్రయం.. తమ జట్టుకు ముంబై ఇండియన్స్‌పై ఘన విజయాన్ని సాధించి పెట్టింది. ఆ మ్యాచ్‌లో నూర్ అహ్మద్, రవి అశ్విన్, రవీంద్ర జడేజా తమ సత్తా చాటారు. దీంతో, ఆర్సీబీ వ్యూహం ఎలా ఉంటుందనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2025 | 05:42 PM