సీఓఈలో చేరిన శాంసన్
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:53 AM
రాజస్థాన్ రాయల్స్ తరఫున వికెట్ కీపింగ్ చేసేందుకు ఆ జట్టు కెప్టెన్ శాంసన్ ఎదురు చూస్తున్నాడు. దీంట్లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో..

బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్ తరఫున వికెట్ కీపింగ్ చేసేందుకు ఆ జట్టు కెప్టెన్ శాంసన్ ఎదురు చూస్తున్నాడు. దీంట్లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో ఫిట్‌నెస్ టెస్టు కోసం అతను బెంగళూరు వచ్చాడు. కుడిచేతి చూపుడు వేలికి సర్జరీ తర్వాత సంజూకు ఐపీఎల్‌లో బ్యాటర్‌గా ఆడేందుకు మాత్రమే గతంలో అనుమతిచ్చారు. దీంతో రాజస్థాన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కోసం మరోసారి పరీక్షలో పాల్గొననున్నాడు. ఒకవేళ అతడికి కీపింగ్ క్లియరెన్స్ లభిస్తే శనివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..