విండీస్ టెస్టు కెప్టెన్సీకి బ్రాత్‌వైట్ రాజీనామా
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:49 AM
West Indies to Announce New Test Captain After Brathwaites Resignation

టీ20 సారథిగా హోప్
సెయింట్ జాన్స్: వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్‌గా క్రెయిగ్ బ్రాత్‌వైట్ (32) తప్పుకొన్నాడు. నాలుగేళ్లపాటు విండీస్ జట్టుకు బ్రాత్‌వైట్ సారథ్యం వహించాడు. కాగా, వన్డే కెప్టెన్‌గా ఉన్న షాయ్ హోప్‌కు టీ20 పగ్గాలు కూడా అప్పగించారు. ఇప్పటిదాకా రోవ్‌మన్ పావెల్ టీ20 సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో విండీస్ టెస్టు సిరీస్ ఆడనుంది. మరికొద్ది రోజుల్లో టెస్టులకు కొత్త సారథిని ప్రకటిస్తామని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. 2021లో జేసన్ హోల్డర్ స్థానంలో బ్రాత్‌వైట్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అతడి హయాంలో 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ టెస్టు మ్యాచ్ నెగ్గింది.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..