Share News

అంకుర హాస్పిటల్స్‌165 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:15 AM

మహిళలు, చిన్నారులకు సూపర్‌ స్పెషాలిటీ సేవలందించే అంకుర హాస్పిటల్స్‌.. ఆసియన్‌ అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) నుంచి రూ.165 కోట్ల..

అంకుర హాస్పిటల్స్‌165 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహిళలు, చిన్నారులకు సూపర్‌ స్పెషాలిటీ సేవలందించే అంకుర హాస్పిటల్స్‌.. ఆసియన్‌ అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) నుంచి రూ.165 కోట్ల నిధులు సమీకరించింది. తమ విస్తరణ ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగపడతాయని అంకుర హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ వున్నం తెలిపారు. మార్కెట్లో తమ స్థితిని బలోపేతం చేసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకు ఆరోగ్య సంరక్షణ కల్పించాలనే తమ దీర్ఘకాలిక విజన్‌ దీని ద్వారా సాకారం అవుతుందని అన్నారు. విస్తరణ వ్యూహంలో భాగంగా తాము దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యాధునిక ఆస్పత్రులు నెలకొల్పాలని చూస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా

Updated Date - Apr 01 , 2025 | 03:15 AM