మీ 5 లక్షలు మాకొద్దు!
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:00 AM
ఖో-ఖో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రీడాకారులు గౌతమ్, చైత్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సన్మానం చేసి.. ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని...

తిరస్కరించిన కర్ణాటక ఖో-ఖో క్రీడాకారులు
మహారాష్ట్రలో రూ.2.50 కోట్ల ప్రోత్సాహకం
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఖో-ఖో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు క్రీడాకారులు గౌతమ్, చైత్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సన్మానం చేసి.. ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. క్రికెట్, ఫుట్‌బాల్ తరహాలోనే ఖో-ఖో ఆటకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఖో-ఖో ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల పారితోషికం, ఎ-గ్రేడ్ ఉద్యోగం ప్రకటించిందని తెలిపారు. కాగా క్రీడామంత్రి నాగేంద్ర అవినీతి ఆరోపణలతో గతేడాది జూన్‌లో పదవి నుంచి దిగిపోవడంతో ప్రస్తుతం ఆ శాఖ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దే ఉంది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జేడీఎస్ తీవ్రంగా మండిపడింది. వరల్డ్‌కప్ నెగ్గిన క్రీడాకారులకు చిల్లరకాసులు పడేశారని విమర్శించింది. క్రీడాకారుల తిరస్కరణతోనైనా ప్రభుత్వానికి సిగ్గురావాలని పేర్కొంది.
ఇదీ చదవండి:
నితీష్‌తో ఆడుకుంటున్న గంభీర్.. తెలుగోడి కెరీర్‌కు డేంజర్