IPL 2025, MI vs RCB: ముంబైలోకి బుమ్రా ఎంట్రీ.. ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్‌పై ఓ లుక్కేద్దాం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:42 PM
ముంబై టీమ్ ఎప్పుడూ ఐపీఎల్‌ను కాస్తా స్లోగానే స్టార్ట్ చేస్తుంది. ఆరంభంలో పరాజయాలతోనే సాగుతుంది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని టైటిల్ సాధించడం ముంబై టీమ్‌కు అలవాటు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రోహిత్ అన్నాడు.

ఐదు సార్లు ఐపీఎల్ (IPL 2025) టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. నిజానికి ముంబై టీమ్ ఎప్పుడూ ఐపీఎల్‌ను కాస్తా స్లోగానే స్టార్ట్ చేస్తుంది. ఆరంభంలో పరాజయాలతోనే సాగుతుంది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని టైటిల్ సాధించడం ముంబై టీమ్‌కు అలవాటు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో రోహిత్ అన్నాడు.
ముంబై టీమ్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌గా తిరిగి వస్తున్నాడు. బుమ్రా రాకతో ముంబై టీమ్ విజయాల బాట పడుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడబోతోంది (RCB vs MI). ఇక, ఆర్సీబీ కూడా పటిష్టంగానే కనబడుతోంది. గత మ్యాచ్ పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఫైనల్ లెవెన్‌పై ఓ లుక్కేద్దాం..
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజెల్‌వుడ్, యశ్ దయాల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..