Discus Throw World Record 2025: డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:47 AM
డిస్కస్ త్రోలో అథ్లెట్ కొత్తగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌తో అంతర్జాతీయ క్రీడా రంగాన్ని ఆశ్చర్యపరిచాడు

రమోనా (యూఎస్): డిస్క్‌సత్రోలో లిథువేనియా అథ్లెట్ మైకొలాస్ అలేక్‌నా చరిత్ర సృష్టించాడు. పురుషుల డిస్క్‌సత్రోలో తొలిసారి 75 మీటర్లు విసిరి నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓక్లహామా త్రోస్ సిరీస్ వరల్డ్ ఇన్విటేషనల్ పోటీల్లో 22 ఏళ్ల మైకొలాస్ ఒక్క రోజే రెండుసార్లు ప్రపంచ రికార్డు త్రోలు విసరడం విశేషం. తొలి త్రోలోనే మైకొలాస్ రికార్డుస్థాయిలో 74.89 మీటర్ల దూరం విసిరాడు. రెండో త్రోలో డిస్క్‌సను 75.56 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలుకొట్టుకొన్నాడు.