Facebook: ఫేస్‌బుక్ కొత్త ఫీచర్..ప్రొఫైల్లో పాట యాడ్ చేయడం మరింత ఈజీ..
ABN , Publish Date - Apr 08 , 2025 | 08:19 AM
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లకు మరింత వినోదాన్ని అందించేందుకు సరికొత్త మ్యూజిక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించి మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను మరింత సరికొత్తగా మార్చుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి రోజు కూడా అనేక యాప్స్ పోటీ పడి వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఒక చక్కటి ఫీచర్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో మీరు మీ ఇష్టమైన పాటను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో యాడ్ చేసుకున్నట్లు, ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది మ్యూజిక్ ప్రియులతోపాటు అనేక మందికి మరింత ఉత్సాహాన్ని అందించనుంది.
ఎంచుకున్న పాట
ఈ కొత్త ఫీచర్‌తో మీరు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మీకు నచ్చిన పాటలను యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ ప్రొఫైల్‌లో పాటను యాడ్ చేసినప్పుడు, ఎవరైనా మీ ప్రొఫైల్‌ను సందర్శించిన వెంటనే ఆ పాట ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. ఇదే కాకుండా, మీరు ఎంచుకున్న పాట మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కొంత సమయం పాటు కనిపిస్తుంది.
అయితే మీ ప్రొఫైల్‌లో పాటను ఎలా యాడ్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయండి
ఆ తర్వాత పైన ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి
మీరు ప్రొఫైల్ పేజీకి వెళ్లిన తరువాత, అక్కడ కనిపించే మూడు-చుక్కల చిహ్నం (More Options) పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీరు క్రిందకు స్క్రోల్ చేసినప్పుడు, “శోధన” (Search) అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయడం
తదుపరి స్క్రీన్‌లో "మ్యూజిక్"(music) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
పాటను ఎంచుకోండి
ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన పాట కోసం సెర్చ్ చేసి, ఆ పాట కనిపించిన తర్వాత, దాని పక్కన ఉన్న మూడు-చుక్కల సింబల్ క్లిక్ చేయండి
పాటను పిన్ చేయండి
మీరు ఎంచుకున్న పాట పక్కన ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయగానే, "పిన్ టు ప్రొఫైల్" అనే ఎంపిక కనిపిస్తుంది. ఆ ఎంపికపై క్లిక్ చేయగానే ఆ పాట మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో యాడ్ అవుతుంది.
ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పాటను యాడ్ కావడానికి కొంత సమయం పడుతుంది
ఈ కొత్త ఫీచర్ ఉపయోగాలు
ఈ ఫీచర్ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను మరింత ఆసక్తికరంగా, మ్యూజికల్‌గా మార్చేస్తుంది. ఎవరైనా మీ ప్రొఫైల్‌ను సందర్శించినప్పుడు, ఆ పాట ప్లే అవుతుంది. ఇది మీ ప్రొఫైల్‌కు ప్రత్యేకతను ఇస్తుంది.
మీకు ఇష్టమైన పాటను పెట్టుకోవడం ద్వారా, మీ స్నేహితులు లేదా ఫాలోవర్స్ మీరు ఎటువంటి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇది ఒక రకంగా మీ ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి ఒక సులభమైన మార్గం
పాటలతో మీ వ్యక్తిగత అభిరుచులను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆ పాటలను ఇష్టపడే వారితో మంచి కనెక్షన్లు ఏర్పరచుకోవచ్చు
మరో ముఖ్యమైన విషయం
ఈ ఫీచర్ ప్రస్తుతం మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, మీరు పాటను యాడ్ చేస్తే అది ఎవరైనా మీ ప్రొఫైల్‌ను చూస్తే ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. కానీ, మీరు ఫేస్‌బుక్ యాప్‌ని ఉపయోగించి మీ పోస్ట్‌ల్లో లేదా ఇన్‌బాక్స్‌లో పాటలను యాడ్ చేయలేరు.
ఇవి కూడా చదవండి:
iPhone Prices: ట్రంప్ టారిఫ్ ప్రభావం..ఇకపై రూ.2 లక్షలకు ఐఫోన్ ధరలు..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News