WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. మీరు ఫోటోలు సేవ్ చేయకుండా మరింత గోప్యత
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:09 PM
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపే ఫోటోలు, వీడియోలను ఇతరులు వెంటనే వారి గ్యాలరీలో సేవ్ చేసుకునే అవకాశాన్ని నిరోధించనున్నారు. అయితే దీని ద్వారా కొన్ని లాభాలు ఉండగా, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్ నుంచి మరో క్రేజీ ఫీచర్ రాబోతుంది. ఇకపై చాటింగ్, గోప్యతా నిబంధనలను మరింత కఠినం చేసేందుకు కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు పంపించిన ఫోటోలు, వీడియోలు మొదలైన మీడియా ఫైల్స్ స్వయంగా వేరే వారి గ్యాలరీలో సేవ్ అవకుండా చేయనుంది. ఈ మార్పులు వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా మారనున్నాయి. ఎందుకంటే ఇది వారి ప్రైవేట్ చాటింగ్, వీడియోలు, చిత్రాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
కొత్త గోప్యతా ఫీచర్
ప్రస్తుతం వాట్సాప్‌లో మీరు పంపే ఫోటోలు లేదా వీడియోలు, చాటింగ్ ఆ ఫైల్‌ను అందుకున్న వినియోగదారులు గ్యాలరీలో స్వయంగా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో వాటిని పంపించే వారి గోప్యత విషయంలో సేఫ్టీ లేదని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు పంపిన చిత్రాలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ ఇతరుల గ్యాలరీలో సేవ్ కాకుండా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీడియా ఫైల్‌లు ఇకపై
ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్ ప్రకారం, మీరు పంపే ఫోటోలు, వీడియోలు, లేదా ఇతర మీడియా ఫైల్‌లు ఇకపై స్వయంగా వారి గ్యాలరీకి సేవ్ అవ్వకుండా ఉండేలా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక వ్యక్తితో చాట్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మీకు ఒక చిత్రాన్ని లేదా వీడియోని పంపితే, అది మీ గ్యాలరీలో స్వయంచాలకంగా సేవ్ చేయలేరు. అంతేకాదు మీరు అడ్వాన్స్ చాట్ ప్రైవసీ సెట్టింగ్ ఆన్‌చేస్తే మీరు పంపించే చిత్రాలు లేదా చాట్‌ను మిగతా వాళ్లు షేర్ కూడా చేయలేరు.
అభివృద్ధి చేసిన గోప్యతా సెట్టింగులు
ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ షేర్డ్ కంటెంట్‌లను ఎక్కువగా చేయకుండా నియంత్రించే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా, ఈ సెట్టింగ్ ప్రారంభించిన తర్వాత, యూజర్ గోప్యత, భద్రత విషయంలో మరింత విశ్వాసంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు WhatsApp చాట్‌లలో మెటా AI ఆధారంగా ప్రక్రియలు కొనసాగుతున్నాయి. వినియోగదారుల గోప్యతా సెట్టింగ్ ప్రారంభిస్తే, చాట్‌లో మెటా AI పరస్పర చర్యలు జరగకపోవడం కూడా ఒక కీలక అంశం. ఈ ఫీచర్ వినియోగదారులకు తమ డేటా ప్రైవసీపై మరింత నియంత్రణను అందించేలా రూపొందించబడింది.
ఇవి కూడా చదవండి:
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News