Trains: వేసవి సెలవుల్లో 52 వీక్లీ స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:55 AM
ప్రస్తుత వేసవి, సెలవుల నేపధ్యంలో 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశంలోని ఆయా ప్రాంతాలకు వీక్లీ రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్: వేపవి సెలవుల్లో ప్రయాణికుల సౌకర్యార్ధం జూన్ చివరి వారం వరకు ప్రత్యేకంగా 52 వీక్లీ రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. ప్రధానంగా ఏప్రిల్ 10 నుంచి జూన్ 26 వరకు (గురు) సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్(Mumbai-Adilabad) (01011) 12 రైళ్లు, ఆదిలాబాద్- సీఎస్‌టీ ముంబై(Adilabad - CST Mumbai)(01012) (గురు) 12 రైళ్లు, మే10వరకు హుబ్లీ-బనారస్(07323) (శని) 6 రైళ్లు, బనార్‌స-హుబ్లీ (07324)(మంగళ) 6 రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
ఈ వార్తను కూడా చదవండి: BJP: సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తేనే బీజేపీలో గుర్తింపు
అలాగే.. ఏప్రిల్ 9 నుంచి 30 వరకు హుబ్లీ- కటిహార్ (07325)(బుధ) 4 రైళ్లు, ఏప్రిల్12 నుంచి మే3 వరకు కటిహార్-హుబ్లీ(07326) (శని) 4 రైళ్లు, ఎస్‌ఎంవిటి బెంగళూరు-నారంగి (06559) (మంగళ)4 రైళ్లు, ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు నారంగి-ఎస్ఎంవిటీ బెంగళూరు(06560) (శని) 4 రైళ్లును నడుపుతున్నట్టు రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News