Dress code for temples,: ఆలయాలకు సంప్రదాయంగా వెళ్లండి
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:45 AM
సినీహీరో సుమన్ మహిళలకు దేవాలయాలకు సంప్రదాయ పద్ధతిలో రావాలని సూచించారు. మేక్‌పలు, నగలు ధరించి దేవాలయాలకు రావడం సరికాదని, భక్తిమార్గంలో హిందూధర్మాన్ని పాటిస్తూ రావాలని చెప్పారు.

మేకప్, నగలు వద్దు
మహిళలకు హీరో సుమన్ సూచన
మల్కాజ్‌గిరి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆలయాలకు సంప్రదాయబద్దంగా వెళ్లాలని, సిన్మా షూటింగ్‌కు వెళ్తున్నట్టుగా మేక్‌పలు, నగలు వేసుకుని వెళ్లకూడదని సినీహీరో సుమన్ అన్నారు. మంగళవారం పాత మల్కాజిగిరిలో పునర్మిర్మాణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ఆసక్తికర సూచనలు చేశారు. సాంప్రదాయ పద్ధతుల్లో మామూలుగానే ఆలయాలకు వచ్చి దైవదర్శనం చేసుకోవాలని కోరారు. మేక్‌పలు వేసుకుని, నగలు ధరించి వస్తే దేవుడు కరుణించడని అన్నారు. భక్తిమార్గంలోనే హిందూధర్మాన్ని పాటిస్తూ దైవదర్శనాలు చేసుకోవాలని సూచించారు. ఎవరిని తాను కించపర్చాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. గుడికి వస్తున్నప్పుడు డ్రెస్‌కోడ్‌తో రావాలని, ప్యాషన్ షోలకు వెళ్తున్నట్టు ఉండకూడదని చెప్పారు. ఆలయాలకు యువత మద్యం సేవించి వస్తున్నారని అలాంటి వారిని ఆలయ నిర్వాహకులు గుర్తించి తరిమేయాలని అన్నారు..
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News