Share News

Funny Viral Video: ఇంటి ముందు సీసీ కెమెరా.. దగ్గరికి వెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Apr 05 , 2025 | 07:45 AM

ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు.. అనే విషయాలు తెలుసుకునేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది..

Funny Viral Video: ఇంటి ముందు సీసీ కెమెరా.. దగ్గరికి వెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..

కళ్లతో చూసిందంతా నిజం అనుకోవడం పొరపాటే అవుతుంది. కొన్నిసార్లు మనం చూసేదానికి, వాస్తవంలో జరిగేదానికీ పొంతన లేకుండా ఉంటుంది. అలాంటి సమయాల్లో చివరకు అంతా అవాక్కవ్వాల్సి ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చూసి అంతా అవాక్కవుతున్నారు. దూరం నుంచి సీసీ కెమెరాలాగే కనిపిస్తున్నా కూడా దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా (CC camera) ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు.. అనే విషయాలు తెలుసుకునేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది.

Firing Viral Video: గన్ వాడాలంటే వీడి తర్వాతే ఎవరైనా.. ఎలా ఫైర్ చేశాడో చూస్తే షాకవ్వాల్సిందే..


దూరం నుంచి చూస్తే అచ్చం సీసీ కెమెరాలాగే కనిపిస్తున్నా కూడా.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ కనిపించింది. కర్రతో దాన్ని టచ్ చేయగా.. చివరకు అది కెమెరా కాదని, పేపర్ అని తెలుస్తుంది. అప్పటిదాకా కెమెరా లాగే కనిపించినా.. తాకిన వెంటనే పేపర్ కాస్త పక్కకు వంగిపోయింది. ఇలా సీసీ కెమెరా బొమ్మను పెట్టి.. నిజం కెమెరాలాగానే అనిపించేలా భ్రమ కల్పించడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Eagle Viral Video: డేగ వేటంటే ఇలాగే ఉంటుంది.. నీటిలోని చేపను ఎలా తినేసిందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సీసీ కెమెరాను ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Toilet Funny Video: వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా.. ఈ బాత్రూంలో షవర్‌ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 07:45 AM