Share News

Marriage Viral Video: పెళ్లికి వచ్చి ఇదేం పని.. బంధువుల నిర్వాకానికి అవాక్కైన వరుడు..

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:47 AM

సాధారణంగా పెళ్లిళ్లలో జరిగే చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ... వరుడితో పాటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..

Marriage Viral Video: పెళ్లికి వచ్చి ఇదేం పని.. బంధువుల నిర్వాకానికి అవాక్కైన వరుడు..

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు.. పేరుకే వివాహాలు కానీ అందులో సినిమాకు మించిన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు అనుకుని ప్లాన్ చేసి చేస్తే.. మరికొన్నిసార్లు అనుకోకుండా జరిగే అనేక సంఘటనలు నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లికి వచ్చిన బంధువులు కార్యక్రమాన్ని వీక్షించకుండా విచిత్రంగా ప్రవర్తించారు. వారి నిర్వాకం చూసి వరుడితో పాటూ పక్కన ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లిళ్లలో (Marriage) జరిగే చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ... వరుడితో పాటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

Eagle Viral Video: డేగ వేటంటే ఇలాగే ఉంటుంది.. నీటిలోని చేపను ఎలా తినేసిందో చూస్తే..


వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై కూర్చుని ఉండగా.. చుట్టూ బంధువులు కూర్చుని వారి సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడికి కాస్త దూరంగా కూర్చున్న కొందరు యువకులు.. (Youth playing Playing card) పెళ్లిలో సంబంధం లేకుండా పేకాటలో ఆడుతున్నారు. పక్కనే వివాహ తంతు జరుగుతున్నా కూడా అదేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ వారి ఆటలో మునిగిపోయారు.

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..


వారి నిర్వాకం చూసి వరుడితో పాటూ చుట్టూ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎవరి గోల వారిదే అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లికి వచ్చారా.. పేకాట ఆడటానికి వచ్చారా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 150కి పైగా లైక్‌లు, 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఇంటి ముందు సీసీ కెమెరా.. దగ్గరికి వెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 08:47 AM