నేత్రపర్వం.. రాములోరి కల్యాణం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:31 PM
జిల్లా వ్యాప్తంగా ఆదివారం శ్రీరామనవమి వేడుకలను భక్తులు వైభవోపేతంగా జరుపుకున్నారు. చలువ పందిళ్ల కింద కల్యాణ వేదికలను సుందరంగా ముస్తాబు చేయగా కల్యాణ వేడుకను భక్తకోటి తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి.. అభిజిత్ లగ్నంలో వేదపండితులు జీలకర్ర బెల్లం పెట్టారు.

- జిల్లా వ్యాప్తంగా వైభవంగా సీతారాముల కల్యాణం
- మార్మోగిన రామనామస్మరణ
- పులకించిన భక్తజనం
జిల్లా వ్యాప్తంగా ఆదివారం శ్రీరామనవమి వేడుకలను భక్తులు వైభవోపేతంగా జరుపుకున్నారు. చలువ పందిళ్ల కింద కల్యాణ వేదికలను సుందరంగా ముస్తాబు చేయగా కల్యాణ వేడుకను భక్తకోటి తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి.. అభిజిత్ లగ్నంలో వేదపండితులు జీలకర్ర బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కల్యాణ వేడుకను భక్తులు కనులారా తిలకించి పులకించిపోయారు. ఈ సందర్భంగా రామనామస్మరణ మార్మోగింది.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
గర్మిళ్ల(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాలలో శ్రీరామాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, రాజకుమారి దంపతులు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు విజిత్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణం సందర్భంగా కల్యాణ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు లక్కీడ్రా ద్వారా ఎంపికైన మహిళలకు చీరలను అందజేశారు.
మంచిర్యాల క్రైం (ఆంధ్రజ్యోతి): పాత మంచిర్యాలలో పూజారి రాజేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఆకుల తిరుపతి, భాగ్యలక్ష్మీ, సిద్దం వెంకటస్వామి-జ్యోతి దంపతులు కల్యాణ మహోత్సవలో పాల్గొని పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పట్టువస్ర్తాలు సమర్పించారు. మంచిర్యాల నియోజక వర్గం పలు ఆలయాల్లో సీతారాములు కల్యాణోత్సవలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పాల్గొని పూజ క్యాక్రమాలు నిర్వహించారు. రామలింగేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, విజిత్‌రావు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దండేపల్లి(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడెం సత్యనారయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సీతారాములకు పట్టు వస్త్రాలను, ముత్యాల తాలంబ్రాలు సమర్పించారు.
నస్పూర్(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆయా ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ దంపతులు, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ దంపతులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్(ఆంధ్రజ్యోతి): శ్రీరాంపూర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్, కృష్ణాకాలనీలోని శివాలయ కమిటీ గౌరవాధ్యక్షుడు బరపటి మారుతి, అధ్యక్షుడు కొల్లూరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి బోరే శ్రీనివాస్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోదండరాం ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బెల్లంపల్లి రూరల్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి సంధ్యారాణి దంపతులు, అప్పాల చంద్రశేఖర్ లక్ష్మీ దంపతు లు, నాయకులు మల్లేశ్, మహేశ్, భరత్, ఆలయ కమిటీ ఈవో బాపు రెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
తాండూర్ (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాండూర్ సీఐ కుమారస్వామి పర్యవేక్షణలో మాదారం ఎస్‌ఐ సౌజన్య, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కాసిపేట (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవాపూర్, సల్పలవాగు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ధర్మారావుపేట రామాలయంలో నిర్వహించిన కల్యాణంలో కొక్కిరాల సత్యపాల్‌రావు-రో జారాణి దంపతులు హాజరై పూజలు చేశారు.
నెన్నెల (ఆంధ్రజ్యోతి): నెన్నెల, గంగారం గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్, నాయకులు పాల్గొన్నారు.
కన్నెపల్లి (ఆంధ్రజ్యోతి): మండలంలోని జన్కాపూర్ లో నిర్వహించిన కల్యాణానికి మాజీ ఎంపీపీ మాధవరపు సృజననర్సింగరావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీతారాముల విగ్రహాల శోభాయాత్ర నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చెన్నూరు (ఆంధ్రజ్యోతి): చెన్నూరు పట్టణంతో పాటు మండలంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి సుద్దాల గ్రామంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశాక చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
వేమనపల్లి (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేమనపల్లి, నీల్వాయి, బమ్మెన తదితర గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి.
భీమారం (ఆంధ్రజ్యోతి): భీమారం మండల కేంద్రంలోని కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఆలయ చైర్మన్ చేకుర్తి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు తిరుణంగిరి కన్నయ్య, విశ్వేశ్వర శర్మ, ప్రవీణ్‌కుమార్‌లు ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి హాజరై సీతారాములకు పూజలు చేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఎస్‌ఐ శ్వేత ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
జైపూర్ (ఆంధ్రజ్యోతి): జైపూర్ ఎస్టీపీపీలోని కోదండరామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పాల్గొన్నారు. వేడుకల్లో రాష్ట్ర కనీస వేతన సలహా సంఘం చైర్మన్ జనక్‌ప్రసాద్, ఎస్టీపీపీ ఈడీ చెన్నకేశవుల చిరంజీవి , జీఎం శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్ (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 3వ జోన్ సీతారామ చంద్రస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పట్టు వస్ర్తాలు సమర్పించారు. మారుతినగర్ ఆంజనేయస్వామి ఆలయం, పట్టణంలోని 6వ వార్డు నార్లపూర్‌లో గల సీతారాముల ఆలయంలో కల్యాణానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ రాజలింగు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్ (ఆంధ్రజ్యోతి): మండలంలోని పొన్నారంలో భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భీమిని (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పోతురాజుల రాజయ్య, బానక్క దంపతులు కల్యాణం నిర్వహించి, హోమాలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరిలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వంగళ సంతోష్-సుమలత దంపతులు కల్యాణాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ (ఆంధ్రజ్యోతి): సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని రామకృష్ణాపూర్ కోదండరామాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్ చేతుల మీదుగా కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు.