Share News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:32 PM

గంజాయి రవాణపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం అర్థరాత్రి మండలంలోని రాపన్‌పల్లి వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు సమీపం లో నార్కొటిక్‌ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం
జాగిలంతో తనిఖీలు చేపడుతున్న పోలీసులు

జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

కోటపల్లి, మార్చి28(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం అర్థరాత్రి మండలంలోని రాపన్‌పల్లి వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు సమీపం లో నార్కొటిక్‌ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి ఇటువైపు వచ్చే వాహనాలు చెన్నూర్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను ఆపి నార్కొటిక్‌ ఎనాలసిస్‌ డాగ్‌తో పాటు పోలీసు సిబ్బం దితో అన్ని వాహనాలను, వారి సామగ్రిని తనిఖీ చేశారు. గంజాయిర హిత ప్రాంతంగా మార్చడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఆకస్మికంగా తనిఖీలు, పెట్రోలింగ్‌ ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో చెన్నూర్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ రాజేందర్‌, ఎక్సయిజ్‌శాఖ అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:32 PM