Share News

సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:14 PM

సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌, కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్‌ సూచించారు. మంగళవారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెం చపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.

సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పడవల యాజమానులతో మాట్లాడుతున్న సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ రాజేందర్‌

కోటపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌, కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్‌ సూచించారు. మంగళవారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెం చపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రాణహిత నది తీరాన్ని సందర్శించి పడవలు నడిపే యాజమా నులు, మత్య్సకారులతో మాట్లాడారు. సరిహద్దులో ఎవరైనా అనుమాననస్పదంగా సంచరించినా, కదలికల్లో తేడా కనిపించి నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణి కులతో మాట్లాడి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలందరు సహకరించాలని, సీసీ కెమెరాల ద్వారా నేరాల నియం త్రణ సాధ్యమవుతుందన్నారు. సైబర్‌ మోసాలు జరుగుతున్న తీరును వివరించి, సైబర్‌ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. డ్రగ్స్‌, గంజాయి నియంత్రణకు సహకరించాలని, గ్రామాల్లో మత్తు పదార్ధాలు విక్రయాలు జరిగినా, సేవిం చినా పోలీసులకు తెలియజేయాలన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, ప్రతి వాహనదారుడు వాహనానికి సంబం దించిన అన్నిధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని యువతకు వాలీబాల్‌ కిట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:14 PM