Award: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ’ పురస్కారం
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:26 AM
ఏఐజీ సంస్థల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి.. జపాన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల నుంచి ‘లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ’ పురస్కారాన్ని అందుకున్నారు.

అందజేసిన జపాన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు నాగేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఏఐజీ సంస్థల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి.. జపాన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల నుంచి ‘లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ’ పురస్కారాన్ని అందుకున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న షోవా యూనివర్సిటీ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. షోవా యూనివర్సిటీ కోటో టోయోసు ఆస్పత్రిలోని డైజెస్టివ్ డిసీజెస్ సెంటర్ ప్రొఫెసర్, చైర్మన్ డాక్టర్ హరుహిరో ఇనౌ, జపాన్ గ్యాస్ట్రోఎంటరాలజికల్ ఎండోస్కోపీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ షింజి తనకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డును అందుకున్న మొదటి భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టుగా నాగేశ్వర్ రెడ్డి నిలిచారు.
గ్యాస్ట్రోఇంటెస్టినల్ (ఏఐ) ఎండోస్కోపీ పురోగతికి డాక్టర్ రెడ్డి చేసిన జీవితకాల కృషికి, ఆవిష్కరణ, శిక్షణ, ఆచరణలో నైపుణ్యం ద్వారా రోగి సంరక్షణను మార్చడంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా చూపిన ప్రభావాన్ని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఏఐజీ ఆస్పత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఎండోస్కోపిక్ అభ్యాసాన్ని అభివృద్ధి చేశారని, ఆయన ఆవిష్కరణలు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడాయని, సవాలుతో కూడిన క్లినికల్ పరిస్థితుల్లో రోగులకు ఉపశమనం కలిగించాయని డాక్టర్ హరుహిరో ఇనోయ్ పేర్కొన్నారు. జపాన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల గుర్తింపు పొందడం ఒక గొప్ప గౌరవమని నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అవార్డు వ్యక్తిగత మైలురాయి కంటేప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎండోస్కోపిస్టుల సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News