CM Revanth Reddy:ఇదే మా ప్లాన్.. సీఎం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:26 AM
CM Revanth Reddy: స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ORR, RRR మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని వివరించారు. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామని అన్నారు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా తెలంగాణలో అమ్ముడవుతున్నాయని వివరించారు. ఇవాళ(శుక్రవారం) జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషమని చెప్పారు.
తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోందని..రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తమకో కల ఉందని.. అదే తెలంగాణ రైజింగ్ అని ఉద్ఘాటించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని అన్నారు. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలోమీటర్ల వరకు తాగునీటితో ప్రవహించేలా చేయనున్నామని చెప్పారు. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగునీటి అవసరాలకు కావాల్సిన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించామని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉందని తెలిపారు. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నామని.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ORR, RRRలను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నామని ప్రకటించారు. ORR, RRR మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతామని చెప్పారు. తెలంగాణకు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని , మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమతో కలిసి రావాలని కోరారు. కలిసి రండి అద్భుతాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని తాను మీకు అందిస్తాననని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్.. ఎందుకంటే
Sankranti festival: చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి
High Court: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jan 10 , 2025 | 11:39 AM