Share News

TG NEWS: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం..

ABN , Publish Date - Jan 16 , 2025 | 08:30 AM

Telangana: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ థియేటర్ దగ్గరలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్ లోపల సిబ్బంది నిద్రిస్తున్నట్లు యజమాని తెలిపారు.

TG NEWS: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ థియేటర్ దగ్గరలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్ లోపల సిబ్బంది నిద్రిస్తున్నట్లు యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈఘటనలో హోటల్ ఫర్నిచర్, రెండు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


భువనగిరి బై పాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి : వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి భువనగిరి బై పాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భార్య , చిన్నపాప అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతులు కేసముద్రానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 16 , 2025 | 10:21 AM