Share News

KTR: ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన రేవంత్.. కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:10 PM

KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. దళిత బంధు ఇవ్వడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.

KTR: ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన రేవంత్.. కేటీఆర్ ఫైర్
KTR:

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు పెడితే తుఫాన్ వాతావరణంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఇంటికి త్వరగా పంపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు రానున్నాయని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌కు కేటీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై ప్రజలు నమ్మకం కోల్పోయారని చెప్పారు. ఆటో వాళ్ల దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఎన్నికలొస్తే.. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. రేవంత్ చెబితే నమ్మరు కాబట్టే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పిలిచి కాంగ్రెస్ ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు.


దళితబంధు కింద ఇస్తామన్న రూ. 12లక్షలపై ఖర్గే, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీరు సరైనది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 28శాతం వాటా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అంబేద్కర్‌ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని తెలిపారు. దళితబంధుతో బీఆర్ఎస్‌కు నష్టం జరిగిన మాట వాస్తవమని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని.. కానీ‌ దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని తెలిపారు. ఖలేజా ఉన్న‌ నాయకుడు కాబట్టే.. కేసీఆర్ దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.


రూ.12లక్షలు కాదు కదా.. రూ.12లు కూడా ఇవ్వరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి దొంగ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ దళితజాతికి మాత్రమే నాయకుడు కాదు. గాంధీ, నెహ్రూకు ధీటైన నాయకుడు అంబేడ్కర్‌ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ.. కేంద్రంలో ఎవరున్నా.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌పై అమిత్ షా కామెంట్స్ దారుణమని చెప్పారు. మతం మతం అంటూ బీజేపీ దేశంలో విద్వేశాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు. రైతుకు కరెంటు, రుణమాఫీ లాంటివి ఇస్తే.. మోదీ, బీజేపీకి నచ్చదని అన్నారు. దోపిడీ దారులకు వేల కోట్లు మాఫీ చేయటానికి బీజేపీ వెనుకాడదని ఆరోపించారు. డీ లిమిటేషన్‌తో దక్షిణాది గొంతు కోస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంబేద్కర్ ముందు చూపుతోనే చిన్న రాష్ట్రాలు:హరీశ్‌రావు

harish-rao-asha-workers.jpg

సంగారెడ్డి జిల్లా: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్దాంతాలను ప్రజలే ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందంటే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3తోనే సాధ్యమైందని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు.అంబేద్కర్ అందరివాడని... తెలంగాణకు మరింత దగ్గరివారని తెలిపారు. దేశంలో ఏ సచివాలయానికి లేని అంబేద్కర్ పేరును తెలంగాణా సచివాలయానికి కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టామని చెప్పారు. అంబేద్కర్ ముందు చూపుతోనే చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 01:13 PM