KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన
ABN, Publish Date - Apr 03 , 2025 | 10:40 AM
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూపై రేవంత్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహారిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల వివాదంలో రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ హై కోర్టు చీవాట్లు పెడుతున్నా రేవంత్ ప్రభుత్వం తీరు మారదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం అంటే బాస్ కాదు ప్రజా సేవకుడని అన్నారు. అర్థరాత్రి బుల్డోజర్లతో హెచ్‌సీయూ యూనివర్సిటీలోకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. భూముల వివాదంలో విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీకి 14 వేల ఎకరాలు ఉండగా హైదరాబాద్‌లో ఉన్న భూమిని ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. హెచ్‌సీయూలో వన్యప్రాణులు లేవని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. దయచేసి కంచె గచ్చిబౌలి 400 ఎకరాలను ఎవరు కొనవద్దని అన్నారు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములను ఎవరు కొన్న ఇబ్బందులు పడాల్సివస్తుందని కేటీఆర్ చెప్పారు.
మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలపై ఇదే తమ కమిట్మెంట్ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా ఆ భూములు కొంటే మళ్లీ వెనక్కు తీసుకుంటామని తేల్చిచెప్పారు. అద్భుతమైన పార్క్‌గా మార్చి హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన అని విమర్శించారు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ భూములంటే ప్రజలవి.. సీఎం ధర్మకర్త మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిపోయి..ప్రభుత్వ పెద్దలు ఇష్టమొచ్చినట్లుగా చేస్తామంటే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు.
దొడ్డి కొమురయ్య స్ఫూర్తి: కేటీఆర్
తెలంగాణ ధీరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి అని కేటీఆర్ తెలిపారు. నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడి అమరత్వం పొందిన కొమురయ్య తెలంగాణ సమాజంలోని పోరాటతత్వానికి నిదర్శనమని ఉద్ఘాటించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారని కేటీఆర్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ
BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..
CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్ నివాళి
Read Latest Telangana News and Telugu News
Updated Date - Apr 03 , 2025 | 11:11 AM