Kite Festival: పతంగుల సందడి షురూ.. కైట్స్ ఎగరేసిన మాజీ మంత్రి
ABN , Publish Date - Jan 13 , 2025 | 10:33 AM
Sankranti 2025: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు చోట్ల కైట్స్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని పతంగులు ఎగురవేస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేస్తారు. వివిధ రకాల పతంగులు ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్నాయి. ఇక చిన్న పిల్లల జోష్ మామూలుగా ఉండదు.
హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పండుగ (Sankratni Festival 2025) అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముగ్గులు.. ఆ తరువాత పతంగులు. సంక్రాంతి సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా కైట్స్ ఎగురవేస్తుంటారు. మహిళలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులతో పండుగను జరుపుకోగా.. మగవారు పతంగులు ఎగురవేస్తూ ఆడి పాడి ఎంజాయ్ చేస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు చోట్ల కైట్స్ ఫెస్టివల్స్‌ను (Kits Festival) నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని పతంగులు ఎగురవేస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేస్తారు. వివిధ రకాల పతంగులు ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్నాయి. ఇక చిన్న పిల్లల జోష్ మామూలుగా ఉండదు. ఇంట్లోని తమ తండ్రి, అన్నలతో కలిసి పిల్లలు కైట్స్‌ను ఎగురవేస్తూ ఆనందిస్తుండగా.. యువత తమ స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేస్తారు.
అలాగే కైట్స్ ఫెస్టివల్‌ను డీజే మోతతో హోరెత్తిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్‌లో పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. డీజే హోరు మధ్య భవనాలపై పతంగులు ఎగురుస్తున్నారు యువత. పోటాపోటీగా పతంగులు ఎగరేస్తూ యువత సందడి చేస్తోంది. బోయినపల్లిలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌లో చిన్నారులతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి పతంగులు ఎగిరవేశారు.
Sankranti 2025: సంప్రదాయం వెనుక సైన్స్.. భోగి పండుగ విశిష్టత ఇదే..
మరోవైపు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరుగనుంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమవగా.. దాదాపు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. అలాగే14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటారు. పతంగుల పండుగకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, తదితర దేశాలకు చెందిన 50 మంది కైట్ ఫ్లైయర్స్ హాజరుకానున్నారు. అలాగే గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ర్టాలకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..
ఈ రాశి వారికి షాపింగ్, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి
Read Latest Telangana News And Telugu News