Uttam Kumar Reddy: టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:03 PM
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం టన్నెల్‌లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రకృతి వైపరిత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందేవారి గురించి మాట్లాడలేనని చెప్పారు.

హైదరాబాద్: ప్రతిపక్షాలు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దేశంలోనే టన్నెల్ అంశంలో అత్యున్నత నైపుణ్యం గల నిపుణులు ఉన్న ఆర్మీతో చర్చించామని చెప్పారు. ఇవాళ(బుధవారం) ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దేశ సరిహద్దులో టన్నెల్ నిర్మించిన TBM నిపుణులను టన్నెల్ లోపలకు పంపి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశామని అన్నారు. 200 మీటర్ల వరకు మట్టి, నీరు కలిసి... బురద పేరుకుపోయిందని.. దీని కారణంగా కొంతమేర ఆటంకం ఏర్పడింది వాస్తవమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
పూర్తి స్థాయిలో నీటిని తొడేసి... టన్నెల్ బోరింగ్ మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో తీసివేయాలని చెప్పామన్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, రాట్ హోల్ మైనింగ్ సిబ్బంది సహకారంతో సిల్ట్ లోనికి వెళ్లి గల్లంతైన ఎనిమిది కార్మికుల ఆచూకీ కోసం ప్రయత్నం చేయబోతున్నామని తెలిపారు. రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని అన్నారు. ప్రకృతి వైపరిత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందేవారి గురించి మాట్లాడలేనని చెప్పారు. ప్రతిపక్షాలు అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లోనే తాను ఇక్కడికి వచ్చానని ఆరోజు నుంచి ఇప్పటి వరకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: సీఎం నోట.. షాకింగ్ మాట..
CM Revanth-PM Modi Meeting: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కోరింది ఇవేనట..
TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Read Latest Telangana News And Telugu News