Share News

MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ తప్పు చేశారు... ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 02 , 2025 | 02:36 PM

MP Chamala Kiran Kumar Reddy: రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధులో రూ.22 వేల కోట్లు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ తప్పు చేశారు... ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
MP Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ పుష్ప(అల్లు అర్జున్) అరెస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి అందరికీ తెలిస్తే... సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని అన్నారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలురకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చారన్నారు. ఈ కేసులో కేటీఆర్ నిర్దోషి కావాలని కోరుకుంటున్నామని... కానీ ఆయన తప్పు చేశారని తేలిందన్నారు. నోటిమాటగా చెప్పిన విషయాలను అధికారులు సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూరించి వివరించామన్నారు. అప్పుల రాష్ట్రంలో ట్రిబుల్ ఆర్ లాంటి ప్రాజెక్టు గుదిబండగా కాకుండా ఉండేందుకు కొన్ని సలహాలు ఇచ్చారని చెప్పారు.


దోచుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపారు. దోచుకునే అలవాటు, దాచుకునే అలవాటు, చేసిన తప్పుల నుంచి తప్పించుకునే అలవాటు తమకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ప్రాజెక్టు అంచనా పెంచారన్నారు. బాధ్యతగా లేని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం ప్రభుత్వం, ప్రజలకు మంచిది కాదని చెప్పారు. ప్రతిపక్షాలు పాలకులకు సరైన దారి చూపించాలన్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు బురదజల్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, హరీష్‌రావు ఇప్పటికైనా మంచి ప్రతిపక్షాన్ని తయారు చేసుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు రైతు భరోసాపై రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మల్టిపుల్ విండోస్ సిస్టం అయిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారన్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరామని చెప్పారు.


ఈ ప్రాజెక్ట్ కోసం ముందు ల్యాండ్ సేకరించాలని కేంద్ర మంత్రి తమకు సూచించారన్నారు. ఇష్టా రీతిన ప్రాజెక్టు కాస్ట్ పెంచారు కాబట్టే రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.12 వేల అవినీతి జరిగిందని కేటీఆర్ అంటున్నారన్నారు. కేసీఆర్ ఎలాగూ బయటకు రారని.. హరీష్ రావు, కేటీఆర్, కవిత వెళ్లి అయినా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిదని సూచించారు. 2025లో అయినా బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కలగాలన్నారు. రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధులో రూ.22 వేల కోట్లు అనర్హులకు ఇచ్చారన్నారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై కేటీఆర్ మాటమారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకరోజు తనకు సంబంధం లేదు అంటాడు... మరోక రోజు అధికారులకు సంబంధం లేదు అంతా తానే చేశానని అంటారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

E Car Race Scam: ఈడి విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా..

CM Revanth Reddy: నేను మారాను.. మీరూ మారండి!

Rythubharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు

Read Latest Telangana News And Telugu news

Updated Date - Jan 02 , 2025 | 02:41 PM