TG NEWS: ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆ పోస్టర్ల కలకలం..
ABN, Publish Date - Jan 07 , 2025 | 11:18 AM
Congress: ఏఐసీసీ కార్యాలయం దగ్గర రైతుభరోసా పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు వెలిశాయి. వరంగల్ డిక్లరేషన్‌పై ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ యూటర్న్ తీసుకున్నారని పోస్టర్లలో కనిపించాయి.

ఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయం దగ్గర రైతుభరోసా పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరిట పోస్టర్లు వెలిశాయి. వరంగల్ డిక్లరేషన్‌పై ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ యూటర్న్ తీసుకున్నారని పోస్టర్లలో కనిపించాయి. రైతు భరోసా రూ.15వేలపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది అంటూ పోస్టర్లలో వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేస్తోందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసాపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేల కంటే.. రూ. 15 వేలు పెంచి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పింది ఒకటయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రూ. 12 వేలు ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఈ పోస్టర్లు కనిపించడంతో చర్చానీయాంశంగా మారింది. అయితే రైతు భరోసా పోస్టర్లు ఏఐసీసీ కార్యాలయం వద్ద కనిపించడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 07 , 2025 | 11:20 AM