మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:15 AM
మహానీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకువెళ్ళాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహిం చిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్య క్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొన్నారు.

పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మహానీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకువెళ్ళాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహిం చిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్య క్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహానికి, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలువేసి నివాళుల ర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంటరానితనం పరిస్థితుల నుంచి ఉపప్రధాని పదవి వరకు అనేక అంశాలను బాబుజగ్జీవన్‌రామ్ చూశారని కలెక్టర్ తెలిపారు. 29ఏళ్ల వయస్సులో శాసనమండలి సభ్యుడిగా, 1937లో బీహార్ అసెం బ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశారని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం చిన్నతనం నుంచే ఆయన కృషిచేశారని, అనేక ఒడిదుడుకు లను తట్టుకొని నిలబడ్డారన్నారు. మహానీయుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలను జిల్లా యంత్రాంగం అమలు చేస్తుందని తెలిపారు. అద నపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని పేర్కొ న్నారు. అంతకు ముందు వివిధ సంఘాల నాయ కులు, ప్రతినిధులు మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప, రెవెన్యూడివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, టిఎన్‌జిఓ అధ్యక్షుడు బొం కూరి శంకర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
కమిషరేట్‌లో...
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా జరి గాయి. కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జగ్జీవన్ రామ్ చిత్రపట్రానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆధునిక భారత నిర్మాణంలో స్ఫూర్తి వంతమైన సేవలందించారని, గొప్ప రాజకీయ వేత్తగా, సామా జిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడార న్నారు. బడుగు వర్గాల అభ్యు న్నతికి కృషి చేశార న్నారు. దేశ రక్షణ మంత్రిగా సురక్షిత సేవలు అందించారన్నారు. ఆయన దేశా నికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు సతీష్, ప్రేమ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నగరపాలక సంస్థలో నివాళులు...
నగరపాలక సంస్థ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కుమా రస్వామి, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు.