పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:36 PM
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పం చాయతీ కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాల యం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వ హించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ జీఓ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతర్గాం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పం చాయతీ కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాల యం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వ హించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ జీఓ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ నెల 19తర్వాత నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మాలెం సురేష్, పెండ్రు మల్లారెడ్డి, తమ్మనవేని శంకర్, భీమయ్య, మల్లేష్ పాల్గొన్నారు.
జీపీ కార్మికుల సమ్మె నోటీస్ అందజేత
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం జీపీ కార్మికులు మండల పరి షత్ అధికారులకు సమ్మె నోటీస్ అందజేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లా యిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఖాజా మాట్లా డుతూ జీపీ కార్మికులు 40 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, నేటికి కనీస వేతనాలు, ఉద్యోగ భధ్రత లేదన్నారు. గ్రీన్‌ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తా మన్న సీఎం హామీ నెరవేరలేదన్నారు. ఈనెల 19 తరువాత నిరవధిక సమ్మె చేస్తామన్నారు. నరేష్, ఎండీ ముస్తాఫా, లక్ష్మయ్య, శ్రీనివాస్, వంశీ, రాజేశం, తిరుపతి పాల్గొన్నారు.