పేదలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:14 AM
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కోనరావుపేటలో శుక్రవా రం ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.

జూలపల్లి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కోనరావుపేటలో శుక్రవా రం ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజచేసి పనులను ప్రారంభించారు. గ్రామంలోని 144 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అందులో 15 ఇండ్లకు ముగ్గులుపోసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడతూ ఎన్నికల సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుం దన్నారు. తహసీల్దార్ జక్కని స్వర్ణ, ఎంపిడిఓ పద్మజ, ఎంపిఓ అనిల్‌రెడ్డి, మార్కెట్‌చైర్మెన్ గండు సంజీవ్, నాయకులు వామన్‌రావు, బొజ్జ శ్రీనివాస్, జలపతిరెడ్డి, పర్శరాములుగౌడ్, పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థకు తావుండదని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. శివపల్లిలో తొమ్మిది ఇంది రమ్మ ఇండ్లకు ఆయన ముగ్గు పోసి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొంతింటి కలను సాకా రం చేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చుతానని పేర్కొన్నారు. నియోజ కవర్గానికి ఏడాదిలో 3500ఇండ్లను ప్రభుత్వం మం జూరు చేస్తుందన్నారు. ప్రతీ లబ్ధిదారునికి రూ.5 లక్షలు చెల్లిస్తుందన్నారు. గతంలో కట్టిన పాత ఇం డ్లకు బిల్లులు ఇవ్వరని, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రత్యేక యాప్‌ద్వారా ప్రభుత్వం పరి శీలించి బిల్లు చెల్లిస్తుందన్నారు. సామ రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల భాస్కర్‌రావు, రవీంద్రనాథ్, శ్రవణ్, నాయకులు రాజనర్సు, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, గోపి, పాల్గొన్నారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ పేదలను మభ్యపెట్టాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బంజేరుపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. అనంతరం విప్ మాట్లా డుతూ బంజేరుపల్లిలో ఫైలెట్ ప్రాజెక్ట్‌గా 65 మం ది లబ్ధిదారులకు 18 మంది ఇండ్లు నిర్మించుకుం టున్నారని తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం నీటి కొరత ఉందని విప్ దృష్టికి తీసుకెళ్ళగా బోర్ వేయాలని అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. కొప్పుల నియోజకవర్గానికి చేసింది ఏమిటని ప్రశ్నిం చారు. మంత్రిగా ఉండి లింక్ కాలువను, పత్తిపాక ప్రాజెక్ట్‌ను ఎందుకు చేయలేదని అన్నారు.
కందుల కోనుగోలు కేంద్రం ప్రారంభం
వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేం ద్రాన్ని ఏఎంసీ చైర్మెన్ లావుడ్యా రూప్లానాయక్‌తో కలిసి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలు గకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తహసీల్దార్ వఖీల్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ కె.రమేష్, పీఆర్ ఏఈ రాజశేఖర్, లింగ య్య, తిరుపతి రెడ్డి, హన్మయ్య పాల్గొన్నారు.