ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:16 AM
ఆశ వర్కర్ల సమ స్యలు పరిష్కరించడంతోపాటు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని సీఐటి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. సిఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

పెద్దపల్లి రూరల్, మార్చి 17 (ఆంఽధ్రజ్యోతి) : ఆశ వర్కర్ల సమ స్యలు పరిష్కరించడంతోపాటు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని సీఐటి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. సిఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ముత్యంరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్‌ల సమస్యలను పరిష్కరించాలన్నారు. నెలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలన్నారు. బడ్జెట్ సమా వేశాల్లో న్యాయం చేయకుంటే పోరాటాలు ఉధృతం చేయ నున్నట్లు పిలుపునిచ్చారు. ఎస్.జ్యోతి, ఆర్.రేణుక, వి.స్వప్న, అనురాధ, వాణి, రాజేశ్వరి , పద్మ, లలిత పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరిం చాలని తహసీల్దార్, వైద్యుడికి ఆశ కార్యకర్తలు వినతిపత్రాన్ని అందించారు. ఏఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశ కార్యకర్తలకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.