గోదావరి గోసకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణం
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:20 AM
వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే... మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

గోదావరిఖని, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే... మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరినది ఎండిపోయిన స్థితిని వివరించేందుకు రామగుం డం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్‌ఎస్ నాయకుడు బొడ్డు రవీందర్ సోమవారం గోదావరిఖని బ్రిడ్జి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవెల్లి దాకా చేపట్టిన పాదయాత్రను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈనెల 22 వరకు 180 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగ నుందని తెలిపారు. రామగుండంలో అగ్గి రాజుకుంటుందని, ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందన్నారు. పాదయాత్రలో అన్నదాతల కష్టాలను, కన్నీళ్లను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిస్తే, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం కుంగిదనే నెపంతో నీటిని దిగువకు వదిలి తెలం గాణను ఎండబెట్టిందని విమర్శించారు. అనంతరం చందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ఎండబెట్టడం వల్లే తెలంగాణలో రైతన్నల పంట పొలాలు ఎండుతున్నాయని, ప్రజలకు వివరించే విధంగా పాదయాత్ర సాగుతుం దన్నారు. తెలంగాణ బీడు భూములను సస్యశామలం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ గోదావరినది ఇరువైపులా కాంగ్రెస్ ప్రజా ప్రతి నిధులను గెలిపించడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ ఎమ్మెల్యే మాట్లాడే పరిస్థితి లేకపోవడంతోనే నది ఎడారిగా మారిందన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయరెడ్డి, మాజీ జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, నాయకులు కౌశిక హరి, మాజీ కార్పొరేటర్లు పెంట రాజేష్, బాదె అంజలి, కల్వచర్ల కృష్ణవేణి, శ్రీనివాస్, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, నూతి తిరుపతి, జేవీ రాజు, రాకం వేణు, చల్లా రవీందర్‌రెడ్డి, వడ్డేపల్లి శంకర్, కౌటం బాబు, కుడుదుల శ్రీనివాస్, ఆడప శ్రీనివాస్, జక్కుల తిరుపతి, మేడి సదానందం, బండారి ప్రవీణ్, ఆర్శనపల్లి శ్రీనివాస్, కొల్లూరి సతీష్, ఎడివెల్లి శ్రీనివాస్, ధరణి రాజేష్, ధర్మాజీ కృష్ణ, రాములు, కోల సంతోష్,ఇంజపురి నవీన్, సారయ్య నాయక్, సంపత్ పాల్గొన్నారు.