Share News

KTR: అది అసమగ్ర కులగణన

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:41 AM

‘లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్‌ సర్కారు కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్‌ జీ?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR: అది అసమగ్ర కులగణన

సర్వే పూర్తయినట్లు పార్లమెంటునే తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్‌ జీ?

  • 51 శాతమున్నా బీసీ జనాభా పదేళ్లలో 46 శాతానికి పడిపోయిందా?

  • అదే అగ్రవర్ణాల జనాభా ఎలా పెరిగింది?

  • ‘స్థానికం’లో 42ు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం కాంగ్రె్‌సకు లేదని తేలింది

  • తెలంగాణ బీసీలకు క్షమాపణలు చెప్పండి

  • కాంగ్రెస్‌ అగ్రనేతకు కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్‌ సర్కారు కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్‌ జీ?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. గత దశాబ్ద కాలంలో బలహీన వర్గాల జనాభా తగ్గినట్లు చూపిన తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్‌ అగ్ర నేతకు బుధవారం లేఖ రాశారు. ‘అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయినట్టు సాక్షాత్తూ దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్‌ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కిందట చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లని తేలింది. రాష్ట్ర జనాభాలో ఇది 51 శాతం కాగా.. మైనారిటీల్లో ఉన్న బీసీలను కూడా కలిపితే మొత్తం బీసీల సంఖ్య 61 శాతం.. అలాంటిది పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ సర్కారు కులగణన సర్వేలో బీసీల జనాభా 1.64 కోట్లకు తగ్గింది.. ఇంకా పెరగాల్సిన బీసీ జనాభా 46 శాతానికి ఎలా పడిపోతుంది.


ఇదే పదేళ్లలో అగ్రవర్ణాల జనాభా ఎలా పెరుగుతుంది. బీసీ సంఘాల నేతలు కులగణన నివేదికను చించి నిరసన తెలిపారు. సర్కారు కులగణన అంతా తప్పుల తడక అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి’ అని పేర్కొన్నారు. కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే రాహుల్‌ పార్లమెంట్‌లో దీని ప్రస్తావన తెచ్చారని ఆరోపించారు. కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూేస్త సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రె్‌సకు లేదని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయిందన్నారు. చివరకు కాంగ్రెస్‌ పరంగా మాత్రమే సీట్లిస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే ఏంటని నిలదీశారు.


రాహుల్‌ వ్యాఖ్యలు విడ్డూరం..

కులగణనలో తప్పుడు లెక్కలపై బీసీ బిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే..వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్‌ మాట్లాడటం దారుణమని కేటీఆర్‌ ఆక్షేపించారు. ‘తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసే ఈ ఫెయిల్యూర్‌ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరడం మరో విడ్డూరం. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ బూటకమని తేలిన నేపథ్యంలో తెలంగాణలోని బీసీలకు రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. కాగా, నల్లవల్లి, ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

Updated Date - Feb 06 , 2025 | 04:41 AM