Share News

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:38 AM

Mastan Sai case update: రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు పలువురు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం
Mastan Sai case update

హైదరాబాద్: లావణ్య రాజ్ తరుణ్‌ల వివాదం ఆ మధ్య తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా మస్తాన్ సాయి (Mastan Sai Case) ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మస్తాన్ సాయి కేసుపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఇవాళ(ఆదివారం) లేఖ రాశారు. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది కోరారు.


Abdul-Nazeer.jpg

దర్గా ప్రతిష్టతకు భంగం..

ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య న్యాయవాది నాగూరు బాబు పేర్కొన్నారు.


దూకుడు పెంచిన పోలీసులు..

మస్తాన్ సాయి కేసులో కేసులో నార్కోటిక్స్ పోలీసులు (Narcotics police) దూకుడు పెంచారు. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో డ్రగ్స్ వాడకం వీడియోలు భారీగా లభించాయి. దీంతో డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను నార్కోటిక్‌ పోలీసులు సేకరిస్తున్నారు.


గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. తాజాగా వీరితో పాటు పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలను నార్కోటిక్స్ పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాలో నార్కోటిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మస్తాన్ సాయి స్నేహితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు, పది మంది అబ్బాయిల వివరాలను నార్కోటిక్ పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!

Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 16 , 2025 | 11:47 AM