Share News

Hyderabad: ఆ వీడియోలను యాప్‌లో పెట్టాడు.. లావణ్య సంచలన కామెంట్స్..

ABN , Publish Date - Feb 13 , 2025 | 06:33 PM

మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని..

Hyderabad: ఆ వీడియోలను యాప్‌లో పెట్టాడు.. లావణ్య సంచలన కామెంట్స్..
Lavanya - Raj Tarun

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలనే ఇదంతా చేసినట్లు లావణ్య చెప్పింది. మాస్తాన్ సాయి కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మాస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే.. తనను కూడా ఆ కేసులో ఇరికిరించారని వాపోయింది. అతని వద్ద 800 నగ్న వీడియోలు పైనే ఉన్నాయని.. అందులో తన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య వెల్లడించింది.


తాను జైలు నుంచి బయటకు రాగానే రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది లావణ్య. రాజ్ తరుణ్ ఎలాంటి వాడో తనకు తెలుసునని చెప్పిన లావణ్య.. అతను క్రిమినల్ కాదని.. మస్తాన్ సాయి వల్లే రాజ్ వెళ్లిపోయాడని వివరించింది. తనను క్షమించాలంటూ మీడియా ముఖంగా రాజ్ తరుణ్‌ను లావణ్య వేడుకుంది. తన పక్కనే ఉంటే తాను కాళ్లు పట్టుకోవాలని అనుకుంటున్నట్లు కన్నీరుమున్నరయ్యింది.


తనకు మస్తాన్ సాయి ద్వారా ప్రాణహానీ ఉందని లావణ్య ఆరోపించింది. మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌ను తాను తీసుకొచ్చానని చెప్పింది. ఆ హార్డ్ డిస్క్‌ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. గుంటూరులో కేసు పెట్టిన సమయంలోనే తనపై 20 మంది మస్తాన్ సాయి అనుచరులు దాడి చేసినట్లు లావణ్య వెల్లడించింది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే.. అతని భార్య, ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్‌లో ఉన్నాయంటున్నారని లావణ్య పేర్కొంది. కానీ, ఆ హార్డ్ డిస్క్‌లో 44 మంది అమ్మాయిలకు సంబంధించి 250 కి పైగా వీడియోలు ఉన్నాయని చెప్పారు. రాజ్ తరుణ్, తన పర్సనల్ డేటాను కూడా తీసుకుని మస్తాన్ సాయి వేధించాడని లావణ్య ఆరోపించింది. మస్తాన్ సాయి వీడియో కాల్‌లో ఉన్నాను తప్ప.. పోలీస్ ఆఫీసర్స్‌తో తాను మాట్లాడలేదని స్పష్టం చేసింది. మాస్తాన్ సాయి వేధింపులు తట్టుకోలేకనే నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిపోయారని చెప్పింది. 2014 నుండి మాస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నాడని.. తన ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారంది. రెడ్ ఫ్లై, బ్ల్యూమీ యాప్‌లో ఈ వీడియోలు పెడుతున్నట్లు లావణ్య ఆరోపించింది.


పోలీస్ కస్టడీలోకి మస్తాన్ సాయి..

మస్తాన్ సాయిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మస్తాన్ సాయిని ఈ మూడు రోజుల పాటు విచారించనున్నారు. పోలీసులు విచారణలో మస్తాన్ సాయి ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతాడోననే ఉత్కంఠ నెలకొంది.


Also Read:

త్వరలో ఫాస్టాగ్ కొత్త రూల్స్..

వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్..

భయమన్నది వీడి బ్లడ్‌లో లేదనుకుంటా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 13 , 2025 | 06:48 PM