కంప్యూటర్ విద్యతో బంగారు భవిష్యత్
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:18 PM
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్‌కు దారులు వేసినట్లేనని ట్రైనీ కలెక్టర్ గరీమానరుల అన్నారు.

- విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన
- ట్రైనీ కలెక్టర్ గరీమానరుల
- గుండుమాల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభం
కోస్గి రూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్‌కు దారులు వేసినట్లేనని ట్రైనీ కలెక్టర్ గరీమానరుల అన్నారు. శనివారం గుండుమాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) డిజిటల్ తరగతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో ఏఎంవో విద్యాసాగర్, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం నర్సిములు ఉపాధ్యాయులు గీత, భాగ్యలక్ష్మి, అజ్మీర తదితరులున్నారు.
ల్యాబ్ తరగతులను వినియోగించుకోవాలి
నారాయణపేటరూరల్ : జిల్లాలో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తరగతులను విద్యార్థులు వినియోగించుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. శనివారం మండలంలోని జాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో ల్యాబ్ తరగతులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులకు ఈ తరగతులు ఉపయోగపడేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను, టీఎల్‌ఎం, సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ అమలును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పద్మజ, ఎండీఎం యాదయ్యశెట్టి, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్, ఉపాధ్యాయులు బాలకృష్ణ, విశ్వనాథ్‌రెడ్డి, రజిత, గీత పాల్గొన్నారు.
వందశాతం ఉత్తీర్ణతతో జిల్లాకు మంచి పేరు తేవాలి
విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని డీఈవో డాక్టర్ గోవిందరాజులు అన్నారు. శనివారం మండలంలోని జాజాపూర్ జ డ్పీహెచ్‌ఎస్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనంతో పాటు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. హెచ్‌ఎం భారతి, భానుప్రకాశ్, నరసింహా, యాదయ్యశెట్టి తదితరులున్నారు.