Share News

వేతనాలు అందించాలి

ABN , Publish Date - Mar 15 , 2025 | 11:19 PM

పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ శనివారం ధన్వాడ మండల పరిషత్‌ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా నిర్వహించారు.

వేతనాలు అందించాలి
ఎంపీడీవోకు వినతిపత్రం అందిస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లు

- పరిషత్‌ కార్యాలయం ముందు పంచాయతీ వర్కర్ల ధర్నా

ధన్వాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ శనివారం ధన్వాడ మండల పరిషత్‌ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, దీంతో తమ కుటుంబాలను ఎలా నెట్టుకురా వాలంటూ వారు వాపోయారు. నెలనెలా వేతనం ఇస్తామని మూడు నెలలు అవుతున్నా ఇ ప్పటివరకు వేతనాలు రావడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్మికులను పర్మి నెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో సాయిప్రకాష్‌, ఎంపీఈవో వెంకటేశ్వర్‌రెడ్డిలకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాము, బాలకృష్ణ, భాను, ఇమ్రాన్‌, చంద్రప్ప, బాలయ్య తదితరులున్నారు.

Updated Date - Mar 15 , 2025 | 11:19 PM