రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Mar 15 , 2025 | 11:21 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ విష్ణువర్దన్‌రెడ్డి, గవినోళ్ల నర్సింహారెడ్డిలు అన్నారు.

- అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ నిరసన
మక్తల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ విష్ణువర్దన్‌రెడ్డి, గవినోళ్ల నర్సింహారెడ్డిలు అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, మాట్లాడారు. ప్రజల తరపున అ సెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే సస్పెన్షన్లకు తెర తీశారన్నారు. జగ దీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలుపర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆశిరెడ్డి, హన్మంతు, సుదర్శన్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, రఘు, జుట్ల శంకర్, బండారి ఆనంద్, చిట్యాల ఉమా శంకర్‌గౌడ్, మన్నాన్, సాదిక్, అస్గర్‌అలీ, సుధా కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుమలేష్‌గౌడ్, కర్రెం అంజి, శ్రావణ్‌కుమార్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్, అంబ్రేష్, మిల్లర్‌సూరి పాల్గొన్నారు.