Share News

మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:10 PM

నారాయణపేట జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ సంబంధిత అధి ారులను ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ సంబంధిత అధి ారులను ఆదేశించారు. మంగళవారం సాయం త్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం గంజాయి కాకుండా బీడీ, సిగరెట్‌, మద్యం లాంటివి కూడా విద్యా ర్థులపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని, కళాశాలల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ నల్లపు లింగయ్య స్పందిస్తూ జిల్లాలోని అన్ని జూనియర్‌, డిగ్రీ కళా శాలల్లో యాంటీ డ్రగ్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సాగు సరఫరాకు సంబంధించి జిల్లాలో 2022లో మూడు కేసులు, 2024లో మూడు కేసులు నమోదు అయ్యాయని ప్రస్తుతం ట్రయల్స్‌ నడస్తున్నాయని డీఎస్పీ వివరించారు. ఇకపై జిల్లాలో మరెక్కడా ఇలాంటి కేసులు నమోదు కావడానికి వీలు లేకుండా రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీస్‌, ఎ క్సైజ్‌ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. మాదక ద్రవ్యాల నిషేధిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వచ్చే సమావేశా నికి జిల్లా ఆరోగ్యశాఖ అధికారి, సైకాలజిస్టు కూడా అందుబాటులో ఉండాలని ఆయన సూ చించారు. సమావేశంలో ఆర్టీవో మేఘాగాంధీ, ఎక్సైజ్‌ సీఐలు అశోక్‌కుమార్‌, బాలకృష్ణ, ఎస్‌ఐలు గురువయ్య, ఎల్‌ఎస్‌.శిరీషా, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, డీపీఆర్‌వో ఎంఏ.రషీద్‌, డీఐఈవో సుదర్శన్‌, డీఈవో గోవిందరాజులు, సీ-సెక్షన్‌ అధికారి అఖిలప్రసన్న తదితరులున్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:10 PM